Breaking News

RRR ఇస్తే వంద కోట్లు: నిర్మాతకు ఆఫర్!


ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, అమితాబ్‌, నయనతార వంటి వారు నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా రూపొందుతున్న ‘సైరా..నరసింహారెడ్డి’, ప్రభాస్‌ హీరోగా ‘బాహుబలి’ తర్వాత ఆయన నటిస్తున్న ‘సాహో’, జిల్‌ రాధాకృష్ణ చిత్రాలు టాలీవుడ్‌లోనే కాదు.. దేశంలోని అన్ని భాషల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే వీటన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘బాహుబలి’తో దేశ విదేశాలలో సంచలనాలు సృష్టించి, ప్రభాస్‌కే కాదు... తనకంటూ దేశవ్యాప్త గుర్తింపు తెచుకున్న రాజమౌళి తదుపరి చిత్రంపై ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తోంది. ‘బాహుబలి’తో ఏకంగా 1000కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కనకవర్షం కురిపించిన రాజమౌళి తన తదుపరి చిత్రంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్‌ తీయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించే అదృష్టం దొరకడం, అందునా ‘బాహుబలి’ తదుపరి చిత్రమే జక్కన్నతో నిర్మించే లక్‌ అంటే మాటలు కాదు. అది డి.వి.వి.దానయ్యని వరించింది. 

నిజానికి ఈ చిత్రం దానయ్య చేయకపోయినా బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు రాజమౌళితో ఇలాంటి రియల్‌ మల్టీస్టారర్‌ అంటే ఎవరైనా ముందుకు వస్తారు. కరణ్‌జోహార్‌ నుంచి ఇలా జక్కన్న పిలుపుకోసం ఎదురు చూస్తోన్న బడా నిర్మాతలు ఎందరో ఉన్నారు. కానీ ముందుగా అడ్వాన్స్‌ తీసుకుని కమిట్‌ అయిన కారణంగా, ఆ మాటకి కట్టుబడి రాజమౌళి ఈ అవకాశం దానయ్యకే ఇచ్చాడు. ఇక దానయ్య ఎప్పటినుంచో బడా బడా చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఇటీవలే కొరటాలశివ-మహేష్‌బాబులతో ‘భరత్‌ అనే నేను’ ద్వారా బ్లాక్‌బస్టర్‌ కొట్టి, ప్రస్తుతం రామ్‌చరణ్‌తో బోయపాటి శ్రీను చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయినా దానయ్య కెరీర్‌ ఇప్పటివరకు ఒక ఎతైతే, రాజమౌళి-జూనియర్‌ ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ల చిత్రం మరో ఎత్తనే చెప్పాలి. 

ఇక ఈ చిత్రం నుంచి నిర్మాతగా దానయ్య తప్పుకుని తమకు అవకాశం ఇస్తే అందుకు నజరానాగా దానయ్యకు ఏకంగా 100కోట్లు ఇవ్వడానికి బాహుబలి నిర్మాతలు  ముందుకు వచ్చారట. దానయ్య పెట్టే బడ్జెట్ కంటే ఎక్కువైనా సరే.. ఎంత బడ్జెట్‌ అడిగితే రాజమౌళికి అంత బడ్జెట్‌ కేటాయిస్తామని, మిగిలిన నియమనిబంధనలతో పాటు గుడ్‌విల్‌గా దానయ్యకి 100కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేయడం ఈ సినిమాకి ఏర్పడిన క్రేజ్‌కి ఉదాహరణగా చెప్పుకోవాలి. అయితే దానయ్య మాత్రం ఈ ఆఫర్‌ని తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. రాజమౌళితో సినిమా చేయాలనేది తన కల అని, అది ఎంత ఖర్చు అయినా పెట్టడానికి రెడీ అని చెబుతూ.. బాహుబలి నిర్మాతలు ఇచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. అది విషయం.



By October 24, 2018 at 12:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43150/ss-rajamouli.html

No comments