MANAGUDI FROM NOV 20 TO 23_ నవంబరు 20 నుండి 23వ తేదీ వరకు మనగుడి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 23 October 2018: Karthika Pournami Managudi programme will be observed from November 20 to 23 in both Telugu states, said Tirupati JEO Sri P Bhaskar.
Addressing Dharmacharyas in SVETA on Tuesday, the JEO said, on November 20 Kaisika Dwadasi, November 21 Alaya Sobha and on November 22 and 23 Karthika Pournami fetes will be observed.
He said Gita Jayanthi will also be observed from December 16 to 18. For these twin occasions, the Dharmacharyas should train and orient the people on the importance of these festivals in the selected villages, he added.
HDPP Chief Sri Ramana Prasad and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 20 నుండి 23వ తేదీ వరకు మనగుడి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
అక్టోబరు 23, తిరుపతి 2018: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబరు 20 నుండి 23వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులందరూ కలిసి జయప్రదం చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మంగళవారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్లు, ధర్మప్రచార మండళ్ల సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నవంబరు 20న మంగళ కైశిక ద్వాదశి, 21న ఆలయ శోభ, 22న కార్తీక పౌర్ణమి సందర్భంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే డిసెంబరు 16 నుండి 18వ తేదీ వరకు గీతాజయంతి నిర్వహించనున్నట్టు తెలిపారు. మనగుడి కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి జయప్రదం చేయాలని కోరారు. ఆ తరువాత ధర్మాచార్యుల శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ డా|| రమణ ప్రసాద్, ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య దామోదర నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 23, 2018 at 08:29PM
No comments