Breaking News

MAKE ELABORATE ARRANGEMENTS FOR VAIKUNTHA EKADASI_ డిసెంబర్‌ 18న వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలి : టిటిడి తిరుపతి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌


Tirupati, 24 October 2018: Congratulating the strong work force of TTD for making the twin brahmotsavams a memorable success, TTD EO Sri Anil Kumar Singhal instructed all the Heads of Departments to gear up with same spirit for yet another major religious event Vaikuntha Ekadasi which falls on December 18.

During the review meeting at the Conference Hall in TTD administrative building in Tirupati on Wednesday, he directed the Engineering wing to make necessary arrangements of setting up queue lines near Alwar Tank and constructing sheds in Narayanagiri Gardens for the big day.

He also instructed them to come out with a plan to streamline the queue line at Vendi Vakili in Srivari temple to provide darshan with more ease and comfort to pilgrims. The SE Electrical was also instructed to take remedial measures to prevent fire mishaps at Boondi Potu. The need for separate accommodation for potu workers was also discussed during the meeting.

Appreciating the various art forms performed during twin brahmotsavams, the EO instructed that the CDs of the dance performances should be recorded and made available with the SVBC.

The EO instructed the concerned to go for alternative source measures in the facilities that are being provided to pilgrims, if technical issues arises in software. He directed for the auditing of CC cameras and rain coats which were purchased during the brahmotsavams for security purpose.

Later he also reviewed on the progress of works in Kanyakumari, Hyderabad temples, parking facility in Sri Govinda Raja Swamy temple, Vontimitta Sri Kodanda Rama Swamy temple development activities etc. The EO directed the Sapathagiri chief to ensure that the magazines reach the subscribers on time. Telecast the mode of booking and other details in SVBC for better knowledge of global pilgrims”, he added.

EO, JEOs FELICITATED

The senior officers of TTD have felicitated TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar for the the successful conduct of twin Brahmotsavams.

They thanked the top brass authorities for guiding the employees to work as a team in the right direction with their continuous monitoring and conducting the mega religious events in a smooth manner.

EO also wished the officials to continue to work with the same team spirit in future too.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబర్‌ 18న వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలి : టిటిడి తిరుపతి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

అక్టోబరు 24, తిరుపతి 2018: డిసెంబర్‌ 18న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోగల సమావేశ మందిరంలో బుధవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాటికి క్యూలైన్ల నిర్వహణ, ఆళ్వార్‌ ట్యాంక్‌, నారాయణగిరి ఉద్యానవనాలలో షెడ్ల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో మహాద్వారం నుండి వెండివాకిలి వరకు ఉన్న క్యూలైన్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అధ్యయనం చేయాలన్నారు. తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఎస్‌ఈ ఎలక్ట్రికల్స్‌కు సూచించారు. పోటు కార్మికులు ఉండేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులకు అందుతున్న సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ పనిచేయని పక్షంలో, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రెండు బ్రహ్మూెత్సవాలలో వివిధ రాష్ట్రాల కళాబృందాలు చక్కగా ప్రదర్శించాయని, భక్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఈ ప్రదర్శనలను ఎస్వీబీసీ ద్వారా సిడిలుగా రూపొందించాలని తిరుపతి జెఈవోను కోరారు. బ్రహ్మూెత్సవాలలో భద్రతా సిబ్బంది కోసం కొనుగోలు చేసిన కెమెరాలు, రెయిన్‌ కోట్లను వెనక్కి తెప్పించి ఆడిట్‌ చేయాలన్నారు.

అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను నవంబర్‌లో సిద్ధం చేయాలని ఈవో ఆదేశించారు. హైదరాబాద్‌, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాల నిర్మాణపనులపై సమీక్షించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో ఆధునికరణ పనులలో భాగంగా పార్కింగ్‌ తదితర వసతులు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్ద తనిఖీలు నిర్వహించి పార్కింగ్‌ వసతి కల్పించాలని సూచించారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ పరిసరాలలో పార్కింగ్‌ వసతి కల్పించాలని, మరుగుదొడ్లు, వంటశాల నిర్మాణపనులకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. సప్తగిరి మాసపత్రిక సక్రమంగా అందేలా పాఠకుల నుండి సరైన చిరునామా, సెల్‌నెంబర్లు సేకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సప్తగిరి చందా పొందేందుకు గల మార్గదర్శకాలను ఎస్వీబీసీలో, టిటిడి వెబ్‌సైట్‌లో విశదీకరించాలని కోరారు. పాఠకులు టిటిడి కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి తమ చిరునామా, సెల్‌ నంబరును మార్చుకునేందుకు వీలుగా అప్లికేషన్‌ను రూపొందించాలన్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా డిఎఫ్‌ఎండి, భక్తుల సంఖ్యను లెక్కించేందుకు వీలుగా హెడ్‌ కౌంట్‌ యంత్రం ఏర్పాటుచేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈవో, జెఈవోలను ఘనంగా సత్కరించిన అధికారులు :

శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకుగాను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ను టిటిడి అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యాలు, భద్రతకు సంబంధించి ఈవో, తిరుమల జెఈవో ఎప్పటికప్పుడు సమ్షీలు నిర్వహించి మార్గదర్శనం చేశారని తెలిపారు. ఈ కారణంగా భక్తులకు మెరుగైన సేవలు అందించగలిగినట్టు చెప్పారు. ఈవో ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించి బ్రహ్మోత్సవాలకు చక్కటి కళాబృందాలు వచ్చేలా తిరుపతి జెఈవో కృషి చేశారని కొనియాడారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అధికారులు ఇదే సమాఖ్యస్ఫూర్తితో చక్కగా సేవలందించి భక్తుల మన్ననలు పొందాలని సూచించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.By TTD News October 24, 2018 at 05:28PM


Read More http://news.tirumala.org/make-elaborate-arrangements-for-vaikuntha-ekadasi/

No comments