Breaking News

INDIAN POSTS ISSUES SPECIAL COVERS FOR TIRUMALA BRAHMOTSAVA VAHANAMS_ పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో ఆధ్యాత్మిక పుస్త‌కాలు, సిడి, పోస్ట‌ల్ క‌వ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌


Tirumala, 10 October 2018: The Indian Posts has finally decided to issue special covers commemorating all the holy Vahana processions of Lord Venkateswara during the Navaratri Brahmotsavam.

The TTD Executive Officer Sri Anil Kumar Singhal released the first in series – special cover for the Pedda Sesha Vahanam on Wednesday to commemorate the celestial vehicle of Pedda Sesha Vahanam.

The Cover with a special stamping of Pedda Shesha Vahanam with date and location of Tirumala comprised of Shanku and Chakra, the ensigns of Lord Venkateswara.

The inscription on the back side read: “The procession deity Malayappa Swamy will go on a procession on big seven hooded gold en Sesha Vahana. The Lord of serpents, Adisesha bears the massive weight of the globe with its thousand foot- which dispels sins and who acts as bed for Lord Vishnu. God is Seshi (the saviour) and the others are Sesha Bhooth. The Lord preaches the concept of Shesha-Seshi’.

According to information available the Indian Posts plans to release similar special cover every day in front of every vahanams on Mada Street to commemorate every vahanam at the Navaratri Brahmotsavams.







ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో ఆధ్యాత్మిక పుస్త‌కాలు, సిడి, పోస్ట‌ల్ క‌వ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

అక్టోబ‌రు 10, తిరుమల 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల మొద‌టిరోజు బుధ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ప‌ర‌మ‌ప‌ద్మ‌నాథ‌న్ అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా 4 ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను, బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వం పేరిట 2 సిడిల‌ను, పెద్ద‌శేష వాహ‌నం చిత్రంతో కూడిన పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆవిష్క‌రించారు.

అన్న‌మ‌య్య వెలుగుబాట పుస్త‌కాన్ని శ్రీ కొండ‌వీటి జ్యోతిర్మ‌యి ర‌చించారు. ఇందులో ప్ర‌సిద్ధి చెందిన 51 అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు టీక‌, ప‌రిచ‌యం, తాత్ప‌ర్యం, వేదాంత‌ప‌ర‌మైన విపుల వ్యాఖ్య రాశారు. దుష్యంతోపాఖ్యానం(భార‌త ఉపాఖ్యాన గ్రంథ‌మాల‌) అనే క‌థాంశానికి డా.. జి.వి.సుబ్ర‌హ్మ‌ణ్యం వ్యాఖ్యానాన్ని అందించ‌గా డా.. శ్రీ రంగాచార్య పీఠిక‌ను సంత‌రించారు. పురాణ ప్ర‌శ‌స్తి పుస్త‌కాన్ని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా..స‌ముద్రాల లక్ష్మ‌ణ‌య్య ర‌చించారు. ఇందులో అష్టాద‌శ పురాణాల‌ను ప‌రిచ‌యం చేశారు. నాయ‌న్మారులు అనే హిందీ పుస్త‌కాన్ని డా.. డి.ఎం.రంగ‌య్య ర‌చించారు.

అదేవిధంగా, శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు సంయుక్తాధ్వ‌ర్యంలో బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వం పేరిట 2 సిడిల‌ను రూపొందించారు. వీటిలో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వ ఉద‌య‌పు వాహ‌న‌సేవ‌ల పాట‌లు, శ్రీ‌వారి సేవ‌ల పాట‌లు ఉన్నాయి. ఈ పాట‌ల‌ను శ్రీ వేద‌వ్యాస రంగ‌భ‌ట్ట‌ర్ ర‌చించారు. ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ కె.రాఘ‌వేంద్ర‌రావు సంగీత ప‌ర్య‌వేక్ష‌ణ చేశారు.

పెద్ద‌శేష వాహ‌నం పోస్ట‌ల్ క‌వ‌ర్ ఆవిష్క‌ర‌ణ

కాగా, పెద్ద‌శేష వాహ‌నం చిత్రంతో కూడిన ప్ర‌త్యేక పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తి వాహ‌నం ముందు ఆ వాహ‌నం విశేషాల‌తో పోస్ట‌ల్ క‌వ‌ర్ల‌ను ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ క‌వ‌రుపై ఒక వైపు వాహ‌న‌సేవ ఫొటో, మ‌రోవైపు వాహ‌న విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ కె.రాఘ‌వేంద్ర‌రావు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ న‌గేష్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. ఆంజ‌నేయులు, ఉప‌సంపాద‌కులు డా… న‌ర‌సింహాచార్య, పోస్ట‌ల్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 10, 2018 at 09:26PM


Read More http://news.tirumala.org/indian-posts-issues-special-covers-for-tirumala-brahmotsava-vahanams_-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e2%80%8c%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e2%80%8c%e0%b0%a8/

No comments