Breaking News

గోగినేనికి.. కౌశల్‌ చాలెంజ్‌ విసిరాడు! - Googin's .. Kaushal Challenge thrown out!


అయిపోయిన పెళ్లికి ఇంకా వాయిద్యాలు ఎందుకు అనేది అర్ధం కాని విషయం. బిగ్‌బాస్‌ విజేతగా కౌశల్‌ చరిత్ర సృష్టించాడు అనేది వాస్తవం. ఆయన ఎలా విజయం సాధించాడు? అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. అంతేగానీ ఓడిపోయిన వారు వేయి కారణాలు చెబుతారు. నిందలు వేస్తారు. విజేతలు వీటిని పట్టించుకోకుండా ముందుకు సాగడం ముఖ్యం. బిగ్‌బాస్‌లో ఎంతో పేరున్న సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇందులో చాలా మంది ఆర్థికబలవంతులు, మీడియా అండదండలు ఉన్న వారికి కూడా కొదువలేదు. ఇక విషయానికి వస్తే బిగ్‌బాస్‌ సీజన్‌2లో మొదట్లో కౌశల్‌, హేతువాది అని చెప్పుకునే బాబుగోగినేని కూడా బాగానే కలిసి పోయారు. కానీ ఆ తర్వాత జరిగిన పలు సంఘటనల వల్ల ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. కౌశల్‌ని బయటికి పంపిన తర్వాతనే తాను బయటికి వెళ్తానని ఒకానొక దశలో బాబుగోగినేని ఛాలెంజ్‌ కూడా చేశాడు.

కౌశల్‌ విజేతగా చరిత్ర సృష్టించిన తర్వాత కూడా బాబుగోగినేని మీడియా డిబేట్లలో కౌశల్‌ని విమర్శిస్తూ కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నాడు. తాజాగా బాబుగోగినేని కౌశల్‌ రూల్స్‌ బ్రేక్‌చేశాడని, సోషల్‌మీడియాను మ్యానుపులేట్‌ చేశాడని ఆరోపించాడు. హౌస్‌లో నుంచే ఆయన బయటకు కొన్ని సంకేతాలు పంపాడనే అనుమానాలు కూడా తనకి ఉన్నాయని వాదించాడు. తాజాగా కౌశల్‌ దీనిపై ఘాటుగా స్పందించాడు. 

ఆరోపణలు చేయడం కాదు.. నిరూపించాలి. నేను డబ్బులు పంచి గెలిచినట్లుగా బాబుగోగినేని మాటలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయన నిరూపిస్తే బిగ్‌బాస్‌ టైటిల్‌ని ఆయన చేతుల్లో పెట్టేసి వెళ్లిపోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఏకంగా 40కోట్ల మందిని మోసం చేయడం, డబ్బులు పంచడం సాధ్యమా? కాదా? అనే లాజిక్‌ని ఆలోచిస్తే తెలిసిపోతుంది. కౌశల్‌ ఆర్మీని కించపరుస్తూ మాట్లాడితే మాత్రం తాను సహించేది లేదని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. కౌశల్‌ వాదనలో కూడా నిజం ఉందనే చెప్పాలి...! 



By October 08, 2018 at 04:03AM

Read More

No comments