CULTURAL PROGRAMS LURE TIRUPATITES_ తిరుపతిలో నవరాత్రి బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
Tirupati, 17 October 2018: The cultural activities of Srivari Navaratri Brahmotsavams reached a crescendo on eighth day leaving sweet and fond memories among the music and dance lovers of Tirupati at the premiere platforms of Mahati Auditorium, Annamayya Kalamandiram and Ramachandra Pushkarini.
At the Mahati Auditorium the Kalpataruvu Arts troupe from Chennai kept the audience spell bound with their spectacular presentation of Dance in the evening.
At the Annamacharya Kalamandiram, the artists led by Kum.Aparna from Bangalore presented Bhakti Sangeeta and mesmerized the music lovers of Tirupati.
Similarly at Sri Ramachandra Pushkarini the troupe from Tirupati led by Smt G Gnanaprasuna held the crowds spellbound with their classic instrumental presentation of Veena.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తిరుపతిలో నవరాత్రి బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
అక్టోబరు 17, తిరుపతి 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన కల్పతరువు ఆర్ట్స్‌వారిచే నృత్య కార్యక్రమం జరిగింది.
అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన వి.అపర్ణ బృందం భక్తి సంగీతం వినిపించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన జి.జ్ఞానప్రసూన బృందం వీణ వాద్య సంగీత కార్యక్రమం జరిగింది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
By TTD News October 17, 2018 at 06:41PM
No comments