CULTURAL BONANZA BEGINS AT NAVARATRI BRAHMOTSAVAM IN TIRUMALA_ నాదనీరాజనం వేదికపై అలరించిన చిల్కొండ సిస్టర్స్ గాత్రం
Tirumala, 10 October 2018: TTD has rolled out a cultural bonanza of folk dances, devotional music, dharmic discourses, bhajans in the prestigious platforms of Nada Niranjanam, Asthana Mandapam and Four Mada Streets.
At Nada Niranjanam activity began with Vishnu Sahasranama Parayanam, followed by the Dharmikopanyasam by Dr Chakravarti Raghavan.
Annamayya Sankeertans were rendered later in the afternoon by B Nagaraju & Lakshmi Nagaraju and troupe from Bengaluru. The Nama sankeertan was rendered by Vinod and Co of Kerala.
During the Unjal seva the Dr Jyotsna Lakshmi and team from Hyderabad and the Bhakti sangeet was rendered JV Meghana and P Madhavi team from Hyderabad.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
నాదనీరాజనం వేదికపై అలరించిన చిల్కొండ సిస్టర్స్ గాత్రం
అక్టోబరు 10, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నిర్వహించిన చిల్కొండ సిస్టర్స్‌గా పేరుగాంచి శ్రీమతి ఇందు నాగరాజు, శ్రీమతి లక్ష్మీ నాగరాజు గాత్ర సంగీత కార్యక్రమం భక్తులను అలరించింది. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం శ్రీ బి.కేశన్న, పి.వీరసూర్యకుమార్ బృందం మంగళధ్వని, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన శ్రీ భారతీయ విద్యాభవన్ అధ్యాపక బృందం విష్ణుసహస్రనామ పారాయణం, తిరుపతికి చెందిన డా.. చక్రవర్తి రాఘవన్ ధార్మికోపన్యాసం, కేరళకు చెందిన శ్రీ వినోద్ బృందం నామసంకీర్తన కార్యక్రమాలు జరిగాయి.
మధ్యాహ్నం బెంగళూరుకు చెందిన చిల్కొండ సిస్టర్స్ అన్నమయ్య విన్నపాలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రీమన్నారాయణ…., మత్స్యకూర్మవరాహనృసింహవామన…., జ్యో అచ్యుతానంద…., దేవదేవంభజే దివ్యప్రభావం…. తదితర కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఆ తరువాత హైదరాబాదుకు చెందిన పవన్, హరిణి, సాయిచరణ్ అన్నమయ్య కీర్తనలను చక్కగా ఆలపించారు. ఇందులో అదిదో అల్లదివో శ్రీహరివాసము…., అలమేలుమంగకు నిన్నాతడేమి ఎరగడా…, నందకధర నందగోద నందన…., నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు…., సింహవాహనమిది శ్రీ వేంకటేశుడు…., గోవింద ముకుంద కృష్ణ….. తదితర కీర్తనలను యువ కళాకారులు అద్భుతంగా గానం చేశారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి జ్యోత్స్నలక్ష్మి బృందం అన్నమాచార్య సంకీర్తనలను మృదుమధురంగా గానం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన జె.వి.మేఘన, పి.మాధవి బృందం హరికథ పారాయణం చేశారు.
అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో బుధవారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన జె.జానకి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 10, 2018 at 07:49PM
No comments