Breaking News

నోటీసులు పంపి తొందరపాటు పని చేశారా?


సినిమా ఫీల్డ్‌లోని యూనియన్ల నాయకులు తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మన టాలీవుడ్‌కే వస్తే గతంలో ‘మా’ అసోసియేషన్‌ నటి ప్రత్యూష హత్య కేసులో ఎందుకు స్పందించలేదని ఓ సినీ పత్రికా ఎడిటర్‌ ప్రశ్నిస్తే, అతనని, అతని పత్రికను చాలా కాలం ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేశారు. ఇక ప్రకాష్‌రాజ్‌ వంటి వారి వ్యవహారాలలో కూడా మా అసోసియేషన్‌ గతంలో ఎన్నో తప్పులు చేసింది. ఉదయ్‌కిరణ్‌ నుంచి రంగనాథ్‌ వరకు మరణించినప్పుడు వారికి కనీస మర్యాదు, అంతిమ సంస్కారాలలో హుందాగా వ్యవహరించలేకపోయింది. ఇక ఇటీవల శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేయడంతో వెనుకా ముందు ఆలోచించకుండా ఆమెకి మా అసోసియేషన్‌లో సభ్యత్వం ఇచ్చేది లేదని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. కానీ ‘మా’ అనాలోచితంగా ఈ నిర్ణయం హడావుడిగా తీసుకుందని మా జనరల్‌సెక్రటరీ నరేష్‌ నుంచి పలువురు శివాజీరాజా నిర్ణయంపై వ్యతిరేకించారు. వెంటనే అంతే హఠాత్తుగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ రంగంలోని ‘మీటూ’ ఉద్యమం ఉదృతం అవుతోంది. దీనిపై నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌ కాస్త నేర్పుగా దీనిపై కమిటీ వేసి నిజనిర్దారణ చేస్తామని చెప్పాడు. నానా పాటేకర్‌-తనుశ్రీదత్తా వ్యవహారం అందరికీ తెలిసిందే. దీనిపై నానా పాటేకర్‌ స్పందిస్తూ చట్టప్రకారం తనుశ్రీపై చర్యలు తీసుకుంటానని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడో జరిగిందని తనుశ్రీదత్తా కట్టుకథలు అల్లింది. అవి పూర్తిగా నిరాధార ఆరోపణలు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని తేల్చిచెప్పాడు. కాగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సీఐఎన్‌టీఏఏ (సినీ, టివి ఆర్టిస్టుల అసోసియేషన్‌) నానాకు నోటీసులు జారీ చేసింది. ఇది చాలా తొందరపాటు చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజనిర్ధారణ కమిటీలు వేసి వాటిని శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఎందరి మీదనో ఆరోపణలు వస్తూ ఉంటే కేవలం నానాపాటేకర్‌ మీదనే ఇలాంటి నోటీసులు జారీ చేయడం సరికాదు. 

కాగా ఈ నోటీసులకు వివరణ పంపిన నానా.. తనుశ్రీవి తప్పుడు ఆరోపణలని చెబుతూ, లీగల్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపాడు. కేవలం బాలీవుడ్‌లోని పరిణితీచోప్రా, ప్రియాంకా చోప్రా, ట్వింకిల్‌ ఖన్నా, శిల్పాశెట్టి, డింపుల్‌ కపాడియా, ఫర్హాన్‌ అక్తర్‌ల ఒత్తిడికి లొంగే సినీ, టివి ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నానాకు నోటీసులు జారీ చేసి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 



By October 22, 2018 at 04:48AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43121/film-body.html

No comments