Breaking News

పరువు హత్యలకు ముగింపు ఇచ్చాం: రాఘవ్


పరువు కంటే ప్రేమే గొప్పది అని చెప్పే చిత్రం ‘బంగారి బాలరాజు’: హీరో రాఘవ్  
నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కేఎండీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ చిత్రంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో రాఘవ్ మీడియాతో ముచ్చటించారు.
రాయలసీమలో జరిగిన ఒక యధార్ధ పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఈ మధ్య పరువు కోసం తల్లి దండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడడం లేదు. కానీ ప్రేమలో ఉండే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి. తాజాగా మిర్యాలగూడలో ప్రణవ్, అమృత ఘటన సంచలనం రేపింది. ప్రణయ్ పరువు హత్య అనేక చర్చలకు దారి తీసింది. ఇలాంటి పరువు హత్యలకు సరైన రీతిలో ముగింపు సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా మా వంతు ప్రయత్నం సినిమా ద్వారా చేశాం. ఇటు ప్రేమికుల సమస్యలను అటు తల్లిదండ్రుల సమస్యలను.. చర్చించడం జరిగింది. మంచి కథ.. సెంటిమెంట్, యాక్షన్ అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి అని రాఘవ్ వెల్లడించారు. 
బంగారి బాలరాజు చిత్రంలో ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లి కొడుకుల సెంటిమెంట్, ఎమోషన్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే  చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు మా నిర్మాతలు ఇచ్చిన సహకారం మరవలేనిది. హీరోయిన్‌గా పరిచయమైన కరోణ్య, రాములమ్మ డైలీ సీరియల్‌తో పాటు ఆట6 విన్నర్‌గా నిలిచారు. ఆమె ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది. అలాగే టెక్నికల్ టీమ్ సపోర్ట్ కూడా మరవలేనిది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది అని హీరో రాఘవ్ తెలిపారు. 
చిత్ర నిర్మాతలు ఎం.డి. రఫీ ప్రోత్సాహం మరచిపోలేనిది. నిర్మాతల్లో ఒకరైన రెడ్డం రాఘవేంద్ర రెడ్డి గారి కొడుకుని నేను. నిర్మాత కొడుకుగా కాకుండా హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. దర్శకుడు కోటేంద్ర బాగా సపోర్ట్ చేశారు. గ్రేట్ పర్సన్. షూటింగ్ సమయంలో సీన్ టూ సీన్ వివరించేవారు. తాను అనిత ఓ అనిత లాంటి సూపర్ హిట్ సాంగ్‌లో నటించారు. అలాగే టెలి ఫిలిం రైల్వే ట్రాక్‌తో నంది అవార్డు అందుకున్నారు. నిజంగా తనతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈనెల 25న విడుదల కాబోతున్న ఈ చిత్ర సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాను.. అని రాఘవ్ తెలిపారు.


By October 24, 2018 at 11:26AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43158/hero-raghav.html

No comments