నిఖిల్, నివేదా థామస్ ‘శ్వాస’ స్టార్ట్స్
కుర్ర హీరో నిఖిల్, మళయాల బ్యూటీ నివేదా థామస్ జంటగా వస్తోన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ శ్వాస. ఈ చిత్ర ఓపెనింగ్ హైదరాబాద్ లో జరిగింది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో శర్వానంద్ హీరో హీరోయిన్లపై తొలి క్లాప్ కొట్టగా.. జెమిని కిరణ్, నటుడు నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి సీన్ కు క్రిష్ దర్శకత్వం వహించారు. కొత్త దర్శకుడు కిషన్ కట్టా శ్వాస చిత్రాన్ని అచ్చమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇష్ట్వాన్ లట్టంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ నాకు చాలా నచ్చింది. ఇందులో నా పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. దర్శకుడు, నిర్మాతలు ఇద్దరూ కొత్తే.. మంచి సినమాతో ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.. అని తెలిపారు.
హీరోయిన్ నివేదా థామస్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ చాలా బాగుంది.. నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. అని తెలిపారు.
దర్శకుడు కిషన్ మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా హీరో నిఖిల్ కు కృతజ్ఞతలు. ఈ ప్రయాణం అందంగా ఉండి.. మంచి ఔట్ పుట్ వస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ మొదలైంది అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు కిషన్ మాకు చాలా కాలంగా స్నేహితుడు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. నిఖిల్, నివేదాకు కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు అని చెప్పారు.
ఈ సినిమాతో ఉప్పలపాటి తేజ్, హరిణికేష్ రెడ్డి నిర్మాతలుగా పరిచయం అవుతున్నారు. తేజ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు రెడ్ స్కై ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై శ్వాస చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, నివేదా థామస్
సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కిషన్ కట్టా, నిర్మాతలు: ఉప్పలపాటి తేజ్, హరిణికేష్ రెడ్డి, నిర్మాణ సంస్థలు: తేజ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు రెడ్ స్కై ఎంటర్ టైన్మెంట్స్, సినిమాటోగ్రఫీ: ఇష్ట్వాన్ లెట్టంగ్, సంగీతం: హరిణికేష్, ఆర్ట్: శివ కే, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వంశీ బి, కో డైరెక్టర్: శ్రీనివాసరావు పిన్నమనేని, పిఆర్ఓ: వంశీ శేఖర్,
By October 20, 2018 at 09:10AM
No comments