Breaking News

ఆమని మేనకోడలంట.. లక్ష్యం గట్టిగానే ఉంది!


తెలుగులో మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఆ తర్వాత తనలోని నటనా సత్తాని చాటి బాపు, కె.విశ్వనాథ్‌, ఎస్వీకృష్ణారెడ్డి వంటి పలువురి చిత్రాలలో నటించిన బాపుబొమ్మగా ఆమని తెలుగు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండి పోతుంది. ఈమె వివాహం తర్వాత కూడా 'ఆ..నలుగురు' వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మంచి మంచి పాత్రలను చేయడానికి ఆమె సిద్దంగానే ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈమె తన నటనా వారసురాలిగా తన మేనకోడలిని సినీ రంగ ప్రవేశం చేయిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అది తాజాగా నిజమేనని తేలింది. 

ఆమె మేనకోడలు హృతిక హీరోయిన్‌గా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తోంది. దర్శకుడు మురుగన్‌ తన తాజా చిత్రం 'విడియాద ఇరవేండ్రు వేండుం' చిత్రంతో ఈమెని హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఇదే విషయాన్ని హృతిక తెలుపుతూ, మా అత్తయ్య తెలుగులో మంచి గుర్తింపు పొందింది. మామయ్య ఎన్నో చిత్రాలను నిర్మించారు. వారిద్దరి ఆశీస్సులతో నేను కోలీవుడ్‌ ద్వారా పరిచయం అవుతున్నాను. చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నాను. సినిమా డ్యాన్స్‌లలో కూడా శిక్షణ పొందాను. చిన్నప్పటి నుంచి మా అత్తయ్యలా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక. 

మా తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే ముందు చదువు పూర్తి చేసి తర్వాత నటిగా మారమని సలహా ఇచ్చారు. నా మొదటి చిత్రం తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. అత్తయ్య కన్నా ఎక్కువ చిత్రాలలో నటించి, ఆమె కన్నా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. ఆ దిశగా నేను ఎంతో కష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది. మరి ఈ ఆమని మేనకోడలి కోరిక తీరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..! 



By October 31, 2018 at 02:37PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43276/aamani.html

No comments