Breaking News

రజినీ, మమ్ముట్టి, యంగ్‌టైగర్ ఒకే సినిమాకి?


‘బాహుబలి’ తర్వాత తాము కూడా అదే స్థాయిలో చిత్రాలు తీయాలని బాలీవుడ్‌ మేకర్స్‌ ‘పద్మావత్‌’తో పాటు పలు చిత్రాలతో ప్రయత్నించారు. ఇక కోలీవుడ్‌లో కూడా ‘పులి’ వంటివి వచ్చాయి. కానీ ఇవేమీ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఇక ఎంతో అట్టహాసంగా ప్రారంభించి, ‘బాహుబలి’ని మించిన చిత్రం చేస్తున్నామని చెప్పిన ‘సంఘమిత్ర’ అటకెక్కింది. ఇక కాస్తో కూస్తో శంకర్‌ తీస్తోన్న ‘2.ఓ’ పైనే ఆ ఆశలు, అంచనాలు ఉన్నాయి. 

ఇదే సమయంలో మల్లూవుడ్‌లో కూడా సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ భారీ ప్రాజెక్ట్‌ని చేపట్టాడు. వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వంలో ఆయన ‘ఓడియన్‌’ మూవీలో నటిస్తున్నాడు. మలయాళం అంటే అక్కడ సామాన్యంగా ఎంతో తక్కువ బడ్జెట్‌తో చిత్రాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ ‘ఓడియన్‌’ని మాత్రం ఏకంగా 150కోట్ల బడ్జెట్‌తో 145రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈమూవీ షూటింగ్‌ పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రం పురాణ, ఇతిహాసాల నుంచి ప్రేరణ పొంది పగలు ఒక రకంగా, రాత్రిళ్లు మరో విధంగా ప్రవర్తించే మృగలక్షణాలు ఉన్న పాత్ర ప్రధానంగా సాగుతుంది. ఈ పాత్రలో మోహన్‌లాల్‌ జీవించాడనే టాక్‌ వస్తోంది. 

మరోవైపు మోహన్‌లాల్‌ ‘కాలాపానీ, గాండీవం’ వంటి చిత్రాల తర్వాత కేవలం మలయాళంకే పరిమితం అయ్యాడు. కానీ ఆయన ఇటీవల తమిళంలో ‘జిల్లా’, తెలుగులో ‘జనతాగ్యారేజ్‌, మనమంతా’ చిత్రాలలో నటించాడు. ‘జనతాగ్యారేజ్‌’ చిత్రం షూటింగ్‌ సందర్భంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కి మోహన్‌లాల్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. మరోవైపు కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టిలు కూడా మోహన్‌లాల్‌కి బాగా ఆత్మీయులే. దాంతో మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలోని కథ, పాత్రలను పరిచయం చేసే వాయిస్‌ఓవర్‌ని మలయాళంలో మమ్ముట్టి, తమిళంలో రజనీకాంత్‌, తెలుగులో ఎన్టీఆర్‌లు చెప్పడానికి అంగీకరించారట. సో.. ఈ చిత్రానికి దక్షిణాదిలోని అన్నిభాషల్లో మంచి క్రేజ్‌ రావడం ఖాయమేని చెప్పాలి. 



By October 29, 2018 at 05:44AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43238/rajinikanth.html

No comments