Breaking News

సిగరెట్‌ తాగా, మందు కొట్టా.. కానీ: శ్రియ


అందరు సినిమా రంగంలోని వారు, మరీ ముఖ్యంగా నటీనటులంటే వైభవమైన జీవితం, కావాల్సినంత డబ్బు, గుర్తింపు, సెలబ్రిటీ హోదా, ఫ్యాన్స్‌, నిత్యం లగ్జరీ లైఫ్‌ అని భావిస్తూ ఉంటారు. కానీ నటనలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇష్టం లేకపోయినా మంచి పాత్రలు అయినప్పుడు అందులో జీవించేందుకు నటీనటులు పడే కష్టం మామూలు కాదు. ఎంత వ్యక్తిగత దు:ఖంలో ఉన్నా కూడా కామెడీ సీన్స్‌, రొమాంటిక్‌ సీన్స్‌ చేయాల్సి వస్తే అన్నింటిని మర్చిపోయి ప్రేక్షకులను మెప్పించేలా నటిస్తారు. తన తండ్రి జ్ఞాపకాలు కదలాడుతూ, తాను ప్రాణం కన్నా ఎక్కువగా భావించే నందమూరి హరికృష్ణ మరణం నుంచి కోలుకోకముందే జూనియర్‌ ఎన్టీఆర్‌ 'అరవింద సమేత' చిత్రం పూర్తి చేశాడు. 

ఇక జెడి చక్రవర్తి విషయం తీసుకుంటే ఆయనకు మద్యం అలవాటు ఉందే గానీ సిగరెట్‌ పొగ అంటే మాత్రం పడదు. కానీ ఆయన శివ నుంచి సత్య వరకు ప్రతి సీన్‌లో సిగరెట్లు తాగే సీన్స్‌ ఉండటంతో భరించలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక 'అర్జున్‌రెడ్డి' చిత్రం కోసం విజయ్‌దేవరకొండ ఎంత కష్టపడ్డాడో ఆయన మాటలను బట్టి వింటే అర్ధం అవుతుంది. ఇక నటీమణులకు కూడా ఇలాంటి కష్టాలే ఉంటాయి. సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌గా శ్రియాశరణ్‌ స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ స్టార్స్‌ వరకు అందరితోనూ నటించి, బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల మోహన్‌బాబు 'గాయత్రి'లో మంచి పాత్రను పోషించింది. ప్రస్తుతం ఆమె నారారోహిత్‌, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు వంటి యంగ్‌ హీరోలు నటిస్తున్న 'వీరభోగ వసంతరాయలు'లో నటిస్తోంది. టైటిల్‌ ఎంతో వైవిధ్యంగా ఉన్న ఈ చిత్రం కూడా అంతే వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇంద్రసేన దర్శకత్వంలో అప్పారావు నిర్మాతగా బాబా క్రియేషన్స్‌ బేనర్‌లో ఇది రూపొందుతోంది. 

ఇక విషయానికి వస్తే ఈ చిత్రం గురించి శ్రియ మాట్లాడుతూ.. 'ఇంతవరకు నేను ఎన్నడు కనిపించని, చేయని పాత్రలో నటిస్తున్నాను. ఇందులో సిగరెట్‌ తాగే, మందు కొట్టే సీన్స్‌ చాలా ఉన్నాయి. ఆ సీన్స్‌లో నటించడం నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా సిగరెట్‌ తాగే సీన్స్‌లో బాగా ఇబ్బంది పడ్డాను. ఒకే గదిలో ఆ సన్నివేశాలను చిత్రీకరించడంతో గదంతా పొగతో నిండిపోయేది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేది. గదిలో ఉన్న అందరం ఎంతో ఇబ్బంది పడ్డాం. ఒక గదిలో ఇలాంటి సీన్స్‌ చేయడం ఎంత కష్టమో అర్ధమైంది. ఈ సినిమా చూస్తే ఆ సీన్‌ ఎఫెక్ట్‌ అందరికీ అర్ధమవుతుంది' అని చెప్పుకొచ్చింది. మన పెద్దలు సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నది అందుకే సుమా..! 



By October 23, 2018 at 03:53AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43139/shriya-saran.html

No comments