Breaking News

బాలయ్య పెళ్లి జరుగుతుందట..!


ఎలాంటి చిత్రమైనా సరే.. ఆయా పాత్రలకు, నాటి కాలమాన పరిస్థితులను బాగా అధ్యయనం చేసి మరీ ఓ థీసిస్‌గా సినిమాలు తీసే దర్శకుల్లో క్రిష్‌ ఒకరు. ఆయన తీసిన ప్రతి చిత్రంలోనూ వంకపెట్టేందుకు వీలు కాని విధంగా లోకేషన్ల ఎంపిక నుంచి వస్త్రధారణ, సహజత్వం అనేవి ఉట్టిపడతాయి. ‘గమ్యం’ నుంచి ‘కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలెన్నో దీనికి ఉదాహరణగా నిలుస్తాయి. ‘కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియాడికల్‌ మూవీలలో ఈయన తనదైనశైలిని ఇప్పటికే నిరూపించుకున్నాడు. 

కాగా క్రిష్‌ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌ని రూపొందిస్తున్నాడు. ఇందులో తొలి భాగం ‘కథానాయకుడు’ పేరుతో సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. అతి తక్కవ వ్యవధిలో దీనిని క్రిష్‌ అద్భుతంగా తీస్తున్నాడని తెలుస్తోంది. క్రిష్‌ ఎంటర్‌ అయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు మొదలయ్యాయి. ఇందులో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా, ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తోంది. బసవతారకం గురించి తెలుగు ప్రజలకు తెలిసింది చాలా తక్కువ కావడంతో ఆమె పాత్రలోని ప్రత్యేకత ఎలా ఉంటుంది? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఎంతో సింపుల్‌ జీవితాన్ని, లోప్రొఫైల్‌ని మెయిన్‌టెయిన్‌ చేసిన ఆమె పాత్రని అంతే గొప్పగా మలిచారని అంటున్నారు. ఇప్పటికే విద్యాబాలన్‌ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లుక్‌లో అద్దం ముందు కూర్చున్న ఫొటో అందరినీ అలరించింది. కొన్నిరోజుల కిందట బాలకృష్ణ, విద్యాబాలన్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. 

తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తోన్న బాలకృష్ణ, బసవతారకం పాత్రను పోషిస్తోన్న విద్యాబాలన్‌పై పెళ్లికి సంబంధించిన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. అప్పట్లో పెళ్లిళ్లు ఎలా జరిగేవి? పెళ్లిళ్లలో ఎలాంటి వస్తువులను ఉపయోగించేవారు? అప్పటి వస్త్రధారణ ఎలా ఉండేది? ఇలా అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన క్రిష్‌ ఎంతో సహజంగా వీటిని చిత్రీకరిస్తున్నాడట. మరో రెండు రోజుల పాటు పెళ్లి సీన్స్‌నే తీయనున్నారు. ఆ తర్వాతి షెడ్యూల్‌ని ఔట్‌డోర్‌లో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది....! మొత్తానికి ఈ పెళ్లి సన్నివేశాలు సినిమాలో ఐఫీస్ట్‌గా ఉంటాయని సమాచారం. 



By November 01, 2018 at 07:50AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43285/ntr-biopic.html

No comments