Breaking News

నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఇక లేరు


ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి(62) శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు. హృద‌య సంబంధిత స‌మ‌స్య‌తో చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్లో ఆయ‌నకు ఇటీవ‌ల ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు. 1987లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి కార్తీక పౌర్ణ‌మి, శ్రావ‌ణ సంధ్య‌, విక్కీ దాదా, ముఠామేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్‌, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌డ‌, గ్రీకువీరుడు సినిమాల‌ను నిర్మించారు. 

 

ఈయ‌న మృతి ప‌ట్ల తెలుగు సినీ పరిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది.

నిర్మాత డి.శివ ప్రసాద్ మృతికి సంతాపం తెలియజేసిన చిరంజీవి

ప్రముఖ నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి మృతికి చిరంజీవి సంతాపo తెలియజేసారు. నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి మరణ వార్త తెలియగానే ఆయన కుమారుడు చందన్‌తో  ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.

 ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి.. నాతో ‘ముఠామేస్త్రి’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన  సాత్వికుడు, నాకు మంచి మిత్రుడు. ఆయన మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు.



By October 28, 2018 at 05:02AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43218/siva-prasad-reddy.html

No comments