Breaking News

‘మాకే సాధ్యం’- ఏంటి బాలయ్యా ఇది?


సినిమా రంగంలో పొగడ్తలు, భజనలు సహజమే... కానీ దర్శకుడు హీరోలని, హీరో దర్శకుడిని, వీరిద్దరిని నిర్మాతలు పొగుడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం మా ఫ్యామిలీ, మా కుటుంబం అంటూ సినిమాలలోనే కాదు.. నిజజీవితంలో కూడా తమను తాము ప్రశంసించుకుంటూ ఉంటారు. దీనిపై ఒకనాడు కొన్ని విమర్శలు వస్తే బండ్లగణేష్‌తో పాటు కొందరు తమది భజన కాదు.. బాధ్యత అన్నారు. తమకు హీరోలే దేవుళ్లు కాబట్టి వాళ్లను ఎంత పొగిడినా అది తప్పు కాదని వాదించారు. అయితే మన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటే సరిపోదు... అలాగని కేవలం వారి అభిమానులే చెప్పినా దానికి అర్ధం లేనట్లే . మన ప్రతిభను ఇతరులు చూసి అభినందించి, పొగడ్తలు గుప్పిస్తే బాగుంటుంది. ఇలాంటి ఓ డైలాగ్‌నే మహేష్‌బాబు చేత శ్రీనువైట్ల సెటైర్‌గా వినిపించాడు. 

ఇక విషయానికి వస్తే నందమూరి కుటుంబంలోని హీరోలు మంచి ప్రతిభావంతులే. కానీ వారు వారి ఫ్యామిలీకి ఆద్యుడైన స్వర్గీయ ఎన్టీఆర్‌తో పోలిస్తే మాత్రం దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇక వారి కుటుంబంలో కూడా ఎందరో హీరోలు ఉన్నా బాలయ్య, తారక్‌లు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తున్నారు. తారక్‌రత్నతో పాటు కళ్యాణ్‌రామ్‌ వంటి వారు మాత్రం ఆ స్థాయిలో నటించడం లేదు అనేది వాస్తవం. ఒకసారి చలపతిరావు మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్‌కి కిలోమీటర్ల దగ్గరలోకి కూడా బాలయ్య రాలేడని, ఎన్టీఆర్‌ కారణజన్ముడని, బాలయ్య తన తండ్రి గురించి, ఆయన చిత్రాల గురించి మాట్లాడేందుకు తప్ప తన తండ్రికి సాటి కాలేడని వ్యాఖ్యానించాడు. ఇక లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్‌ ఆజానుబాహుడైతే.. జూనియర్‌ అరంగుళం మాత్రమే అని చెప్పింది. ఇక ఇదే విషయంలో కైకాల సత్యనారాయణ వంటి సీనియర్లు కూడా ఏకీభవించారు. 

ఇక విషయానికి వస్తే బాలయ్య, తారక్‌లు వారి వారి స్థాయిలో మంచి నటులే. కాదని చెప్పలేం. కానీ వారి గురించి వారే పొగుడుకోవడం మాత్రం వినేందుకు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి మాటలనే బాలయ్య తాజాగా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం సక్సెస్‌ మీట్‌లో చెప్పాడు. నేను ఎన్టీఆర్‌ బయోపిక్‌ బిజీలో ఉండటం వల్ల ఈ చిత్రం చూడలేదు. మహిళ అంటే ఎంతో గొప్పది అనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తీశారు. నేను, తారక్‌ చేసిన సినిమాలను మరెవ్వరూ చేయలేరు. అలా చేయడం, చేయాలనుకోవడం కూడా అసాధ్యమే. మా చిత్రాలలో నవరసాలు ఉంటాయి. చారిత్రక చిత్రాలు, పోరాట చిత్రాలకు నందమూరి ఫ్యామిలీ పెట్టింది పేరు. తమ అభిమనులంతా క్రమశిక్షణతో ఉండాలని చెప్పాడు. ఆల్‌రెడీ బాలయ్య, తారక్‌ల గొప్పదనం గురించి ఎందరో కితాబులు ఇచ్చారు. 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో ఎన్టీఆర్‌ నటనకు జక్కన్న, రామ్‌చరణ్‌ నుంచి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇదే విషయాన్ని వేరే ఎవరైనా ఈ వేదికపై చెప్పి ఉంటే బాగుండేది. కానీ బాలయ్య తనకు తానుగా చెప్పడం, ఇతరులకు అసాధ్యమని అనడం, తమ చిత్రాలలో నవరసాలు ఉంటాయని చెప్పడం మాత్రం ఇతర హీరోలను, వారి అభిమానులను కాస్త అవమాన పరిచినట్లే అవుతుంది. దీనివల్ల మంచి జరగకపోగా, అభిమానుల మధ్య వాదోపవాదాలకు శ్రీకారం చుట్టడమేననేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రతి హీరో కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉంటేనే వారు టాప్‌స్టార్స్‌ కాగలరు. అలాగే ప్రతి హిట్‌ చిత్రంలో కూడా దాదాపు నవరసాలు అనేవి సామాన్యంగా ఉండేవే. 



By October 24, 2018 at 04:22AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43152/balakrishna.html

No comments