ఆ దర్శకుడు ఎంత శాడిస్టో తెలిపింది!
ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ ఇలా ప్రతి సినిమా పరిశ్రమలోనూ ‘మీటూ’ ఉద్యమం ఉదృతం అవుతోంది. ఎందరో ప్రముఖుల పేర్లను నటీమణులు, సింగర్స్, ఇతర విభాగాలలోని మహిళలు బయటపెడుతూ ఉన్నారు. ఇక క్రీడారంగం నుంచి రాజకీయరంగం వరకు పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. కాగా బాలీవుడ్ దర్శకుడు విపుల్‌షా తనని లైంగికంగా వేధించాడని, అవమానించాడని, బాలీవుడ్ నటి ఎల్నాజ్ నరౌజీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె నెట్‌ఫ్లిక్ థ్రిల్లర్ ‘సేక్రేడ్ గేమ్స్’లో జోయా పాత్ర ద్వారా సుపరిచితురాలు.
విపుల్ దర్శకత్వం వహించిన నమస్తే ఇంగ్లాండ్ చిత్రంలోని ఓ పాత్రకు ఆమె ప్రయత్నాలు చేసింది. ఈ వేషం కోసం దర్శకుడిని ఎన్నోసార్లు కలిసింది. అప్పుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు ప్రపంచంలోకెల్లా నువ్వే చెత్త నటివి.. అని నేను ఫీలయ్యేలా చేశాడు. తొలిసారి ఆడిషన్స్‌లో నన్ను ముద్దుపెట్టుకున్నాడు. మరో రౌండ్‌లో కూడా అదే పని చేయబోయాడు. అప్పుడు ఆయనను పక్కకు తోసేసి విదేశాలకు వెళ్లిపోయాను. తర్వాత ఇండియా వచ్చాను. అప్పుడు విపుల్ నన్ను పంజాబ్‌లోని పాటియాలాకి రమ్మని పిలిచాడు. కథ నెరేట్ చేయమని అడిగితే, రూమ్‌లోకి రా... కథను నెరేట్ చేస్తానని అన్నాడు.
నేను ‘సేక్రేడ్‌గేమ్స్’లో నటించడం విపుల్‌కి ఇష్టం లేదు. ఆయన ఆ ఆఫర్‌ని తిరస్కరించమని నా మీద ఒత్తిడి తెచ్చాడు. దానిని వదులుకుంటే ‘నమస్తే ఇంగ్లాండ్’లో వేషం ఇస్తానని చెప్పి మూడు నెలలు నన్ను మానసికంగా ఎంతో క్షోభపెట్టాడు. ఆయన కార్యాలయంకి వెళ్లిన ప్రతిసారి నాతో తప్పుగా ప్రవర్తించేవాడు. ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించేవాడు. లైంగికంగా ఆయనకు సహకరించకపోతే నాకు అవకాశం రాదని అర్ధమైంది. ప్రముఖులు తమ పవర్‌ని ఇలా తప్పుడు మార్గంలో ఉపయోగించకూడదనే ఉద్దేశ్యంతోనే నేను ఈ విషయం ఇప్పుడు బయటపెడుతున్నానని ఎల్నాజ్ నరౌజీ తెలిపింది.
By October 22, 2018 at 08:09AM
No comments