Breaking News

నానిలో ఇంతమార్పుకి కారణం ఆ రెండేనా?


నాని ఈ ఏడాది రెండు సినిమాల ప్లాప్‌తో కాస్త డల్ అయ్యాడు. వరసగా ఎనిమిది సినిమాల హిట్‌కి కృష్ణార్జున యుద్ధం సినిమా బ్రేక్ వేసింది. వరస విజయాలతో దూకుడు చూపించిన నానికి కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాల ప్లాప్‌లతో ఇప్పుడు చెయ్యబోయే ప్రాజెక్ట్ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. ‘మళ్ళీ రావా’ హిట్‌తో ఉన్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని క్రికెట్ బ్యాగ్డ్రాప్ ఉన్న ‘జెర్సీ’ సినిమా చేస్తున్నాడు. కథ బాగా నచ్చడంతో నాని ఈ సినిమాకి సై అనడమే కాదు.. అప్పుడే ఈ సినిమాని పట్టాలెక్కించేసాడు కూడా. అలాగే ఈ సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ కూడా పెడుతున్నారట.

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీదున్న నమ్మకంతో నాని దర్శక నిర్మాతలకు భారీ బడ్జెట్ అంటే... ప్రస్తుతం నాని చేసిన సినిమాలకన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా చెయ్యమని.. క్వాలిటీ పరంగా సినిమా రిచ్‌గా ఉండాలని చెప్పాడట. అవసరమైతే తాను రెమ్యునరేషన్ కూడా తీసుకోనని.. సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇవ్వమని నాని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. నాని అలా చెప్పడమే ఆలస్యం.. ఈ సినిమాని మీడియం బడ్జెట్‌తో చేయాలనుకున్న దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈ సినిమాకి ఖర్చు బాగా పెట్టేయ్యడానికి రెడీ అయ్యారట. అందులో భాగంగానే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ని తీసుకోవడం జరిగిందట.

మరి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా అనే కాన్సెప్ట్ ఈమధ్యనే టాలీవుడ్ లో హైలెట్ అవుతూ వస్తుంది. ఇక నాని కూడా ఎలాగూ రెండు సినిమాల ప్లాప్ తో ఉన్నాం.. ఈ సినిమా హిట్ అయితే కాస్త మార్కెట్ పెంచుకోవచ్చని ఉద్దేశ్యంతోనే పారితోషకాన్ని వదిలి లాభాల్లో వాటా దారి పట్టాడంటున్నారు. ఏదిఏమైనా రెండు ప్లాప్‌ల వల్ల నేచురల్ స్టార్ నాని కాంప్రమైజ్ అయినట్లుగానే కనబడుతుంది కదా..!



By October 29, 2018 at 12:32PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43244/nani.html

No comments