సప్తగిరి మాసపత్రిక ద్వారా విస్తృంగా సనాతన ధర్మప్రచారం – ప్రధాన సంపాదకులు డా.కె.రాధారమణ

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
సప్తగిరి మాసపత్రిక ద్వారా విస్తృంగా సనాతన ధర్మప్రచారం – ప్రధాన సంపాదకులు డా.కె.రాధారమణ
అక్టోబరు 12, తిరుమల 2018: సప్తగిరి మాసపత్రిక ద్వారా సనాతన ధార్మిక, నైతిక విలువలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని సప్తగిరి మాసపత్రిక ప్రధాన సంపాదకులు డా.కె.రాధారమణ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరుని దర్శించేందుకు వస్తున్నలక్షలాది భక్తులకు అందిస్తున్నసేవలు, సౌకర్యాలను తెలియజేయడంతోపాటు క్షేత్రమహిమ, పౌరాణిక, వైదిక విజ్ఞానాన్నివిస్తృతం చేయడంలో భాగంగా 1949 ఏప్రిల్ మాసంలో కరపత్రిక సదృశ్యమైన పత్రిక వెలువడిందన్నారు. సప్తగిరులకూ, సప్తగిరీశ్వరునికీ ప్రతీకగా సప్తగిరి అనే పేరును పెట్టారని అన్నారు. నాటి నుండి భక్తి, ధార్మికం, ఆధ్యాత్మికం, ఇతర పుణ్యక్షేత్రాలు, దేవతలు, త్రిమధమతాచార్యుల విశేషాలు, సిద్ధాంతాలు, ధార్మిక, తాత్విక గ్రంథాలను సప్తగిరి మాసపత్రికలో టిటిడి అందిస్తోందన్నారు. ప్రస్తుతం ఈ మాసపత్రిక ఆరు భాషలలో (తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, సంస్కృతం) వెలువడుతోందన్నారు. ధర తక్కువైనా, విశిష్టత ఎక్కువ ఉన్న ఏకైక పత్రిక ఇదొక్కటేనని, చందాను ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాక టిటిడి వెబ్ సైట్ లో ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. 2016 జనవరి మాసం నుంచి సప్తగిరి మాసపత్రికను పూర్తి స్థాయిలో రంగుల్లోకి తీసుకొచ్చామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 1,83,000 మంది పాఠకులు చందాదారులుగా ఉన్నారని అన్నారు. సంవత్సర చందా రూ.60/-, జీవిత చందా రూ.500/-, ఇతర దేశాల వారికి సంవత్సర చందా రూ.850/-. కొత్తగా చందాదారులుగా నమోదు కావాలంటే చీఫ్ ఎడిటర్, సప్తగిరి, టిటిడి, తిరుపతి పేరిట డిడి లేదా ఈఎంవో, ఎంవో, పోస్టల్ ఆర్డర్ తీసి ప్రధాన సంపాదకులు, సప్తగిరి కార్యాలయం, టిటిడి ప్రెస్ కాంపౌండ్, కె.టి.రోడ్, తిరుపతి- 517507 , ఫోన్ నెం. 0877-2264543, అనే చిరునామాకు పంపించాలన్నారు. ఆన్ లైన్ లో కూడా ఇదే పేరిట చెల్లించవచ్చని అన్నారు. ఫిర్యాదులు, సలహాలు, సూచనలను [email protected] ఈ మెయిల్ ఐడికి పంపించాలన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 12, 2018 at 01:14PM


My life membership no.LC30984
ReplyDeleteGOPALA RAJU S R S V
D.NO.50-23-7/3
T.P.T.COLONY
SEETHAMMADHARA
VISAKHAPATNAM-530013
I am not receiving the Saptagiri magzine from January 2019 onwards.Please look into the matter.