Breaking News

‘రోషగాడు’ టీజర్ వదిలారు


విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం ‘రోషగాడు’. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్‌ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్  ‘టీజర్’ను తాజాగా  విడుదల చేశారు. విజయ్ ఆంథోని పవర్‌ఫుల్ డైలాగ్స్ తో పాటు, ఆయన స్వర పరచిన థీమ్ సాంగ్, యాక్షన్ పార్ట్ హైలెట్ గా ఈ టీజర్‌లో నిలిచాయి. నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టంట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ,  పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘రోషగాడు’ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ, పిఆర్ఓ: సాయి సతీష్, సంగీతం: విజయ్ ఆంథోని, నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని, కథ-దర్శకత్వం: గణేష.

Click Here for Teaser



By October 27, 2018 at 01:34AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43202/roshagadu.html

No comments