Breaking News

వర్మకి సరైన మొగుడు లైన్‌లోకి వచ్చాడు!!


బయట సెలబ్రిటీలు కావడానికి చాలా మార్గాలున్నాయి. కాస్త ఆర్ధిక స్తోమత కలిగి ఉంటే అది ఇంకా సులభం అవుతుంది. ఇక సమాజంలో మంచి గుర్తింపు, మంచి మనుషులుగా, ఎవరిచేత విమర్శలు ఎదుర్కోని అజాతశత్రువులపై ఘాటు వ్యాఖ్యలు చేసినా, ఏదో ఒక వివాద విషయాన్ని కలబెట్టినా వారి పేరు మీడియా అత్యుత్సాహం పుణ్యమా అని నెరవేరుతోంది. ఒక రామ్ గోపాల్‌వర్మ వంటి వారు వివాదాల ద్వారా బాగా వార్తల్లో ఉంటూ ఉంటే, కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి వంటి వారిది వేరే దారి. తమిళనాడులోని తెలుగు వారికి అండగా సంస్థను స్థాపించిన ఈయన గతంలో కామసూత్ర వంటి పలు చిత్రాలు తీశాడు. సెన్సార్‌బోర్డ్‌లో కూడా కీలకబాధ్యతలు నిర్వహించాడు. 

ఇక ఇటీవల బాలకృష్ణ తన తండ్రి ‘ఎన్టీఆర్‌’పై బయోపిక్‌ని ప్రారంభించే ముందే వర్మ, కేతిరెడ్డిలు మరో అడుగు ముందుకేశారు. బాలయ్య బయోపిక్‌లో లక్ష్మీపార్వతి వివాదానికి చోటు ఉండదని తెలుస్తోంది. కానీ వర్మ మాత్రం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చిన కీలకపరిణమాలను తీసేందుకు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం తీయనున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిలను గొప్పగా చూపించి, చంద్రబాబుతో సహా నందమూరి కుటుంబసభ్యులను వర్మ టార్గెట్‌ చేయడం ఖాయమని తేలిపోయింది. మరోవైపు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి లక్ష్మీపార్వతి మొదట వివాహం చేసుకున్న వీరగంధం ఎవరు? ఏమిటి? ఎందుకు విడిపోయారు? ఆమె ఎన్టీఆర్‌ని ఎలా వశపరుచుకుంది? వంటి వాటిని చూపించాలని భావించి ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల గ్రామాలలో షూటింగ్‌ మొదలు పెట్టడం, దానిని స్థానిక ప్రజలు అడ్డుకోవడం జరిగాయి. 

ఇక విషయానికి వస్తే తాజాగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ చిత్రాన్ని తాను తీయదలుచుకుంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడే వద్దు అన్నారు. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణం లక్ష్వీపార్వతినే. వర్మ కనుక ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ తీస్తే నేను కూడా ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ తీసి తీరుతాను. వర్మ తీయబోయే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ గురించి తనకు తెలియదని లక్ష్వీపార్వతి చెప్పడం సరికాదు. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతికి సంబంధించిన అన్ని విషయాలను, వివాదాలను వర్మ తీయగలడా? తీస్తాడా? అనేదే నా అనుమానం. ఇప్పటివరకు వర్మ తీసిన బయోపిక్‌లలో ఏ ఒక్క చిత్రంలో కూడా ఎక్కడా వాస్తవాలను చూపించలేదని కేతిరెడ్డి వర్మని ఎద్దేవా చేశాడు...! 



By October 21, 2018 at 05:57AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43109/kethireddy-jagadishwar-reddy-ready.html

No comments