Breaking News

ఇప్పుడా విజయ్ మేల్కొనేది..!!


ప్లాప్ టాక్ వచ్చిన సినిమాకు ఎన్ని హంగులు దిద్దిన ఏం ఉపయోగం? అటువంటి పద్ధతే ఇప్పుడు ‘నోటా’ సినిమాకు చేయనున్నారు మేకర్స్. ‘నోటా’కి నెగటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ మాస్టర్ ప్లాన్ వేసాడు. సినిమాలో కొన్ని అనవసరమైన సీన్స్ ను కత్తిరింపులు చేసేందుకు రెడీ అయ్యారు. నిజానికి ఈ పద్ధతి ఎప్పటినుండో వస్తుందే. సినిమా ప్లాప్ అని టాక్ వస్తే కొన్ని సన్నివేశాల్ని కత్తిరిస్తారు. దీని వల్ల సినిమా ఇంకాస్త మెరుగుపడుతుందని, జనాలు వస్తారని మేకర్స్ ఆశ. ఇలా చేసిన ఏ సినిమాలు సక్సెస్ అయిన దాఖలాలు లేవు.

అటువంటి పద్దతే ఇప్పుడు విజయ్ ఫాలో అయ్యి సెకెండాఫ్ లో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్న రెండు భారీ ఎపిసోడ్లను తగ్గించారు. ఈ రెండు ఎపిసోడ్స్ రన్ టైం దాదాపు 11 నిమిషాలు. సినిమాలో ఈ 11 నిముషాలు ఉండదు అనమాట. ఇలా చేస్తే ప్రేక్షకులు సినిమా చూసే అవకాశముందని యూనిట్ భావిస్తోంది.

శుక్రవారం రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత రోజు శనివారం ఉదయం ఆటా నుండే ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. అటువంటి టైములో ఎన్ని కత్తిరింపులు చేసినా లాభం లేదు. ఫస్ట్ వీకెండ్ లో ‘నోటా’ 40శాతం ఆక్యుపెన్సీ మించలేదు. ఫస్ట్ వీకెండే ఇలా ఉంటే ఇంకా సోమవారం నాటికి దీన్ని పరిస్థితి ఏంటో? ముందే అర్ధమైపోతుంది. దానికి తోడు మరో 4 రోజుల్లో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ఉంది. అరవింద ప్రభావం కూడా పడితే.. ‘నోటా’కి భారీ లాస్ తప్పదంటూ అప్పుడే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.



By October 10, 2018 at 04:07AM

Read More

No comments