త్రివిక్రమ్ విషయంలో ఇది నిజమా..?
నేడు స్టార్స్ నుంచి స్టార్ దర్శకుల వరకు కొన్ని కొన్ని బేనర్లు, నిర్మాతలకు, దర్శకులకే పరిమితం అవుతున్నారు. దాదాపు ప్రతిస్టార్ హీరోకి సొంత హోంబేనర్‌లో, మరో మాతృసంస్థ వంటివి ఉన్నాయి. చిరంజీవికి గీతాఆర్ట్స్, కొణిదెల, వైజయంతీ.. నాగార్జునకు అన్నపూర్ణ, వెంకటేష్‌కి సురేష్ ప్రొడక్షన్స్, బాలయ్యకి తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ బేనర్, వారాహి చలన చిత్ర, పవన్‌కి పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, మహేష్‌బాబుకి ఇందిరా, కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభాస్‌కి యువి క్రియేషన్స్, ఎన్టీఆర్‌కి నందమూరి కళ్యాణ్‌రామ్‌కి చెందిన 'ఎన్టీఆర్‌ఆర్ట్స్' వంటివి ఉదాహరణ.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే ఈయన ఈమధ్య వరుసగా రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు నిర్మాతగా ఉన్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లోనే ఎక్కువ చేస్తున్నాడు. గతంలో రాధాకృష్ణ కూడా హారిక అండ్ హాసిని బేనర్‌లో కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చిత్రాలు తీస్తానని ప్రకటించాడు. ఇతర దర్శకులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేస్తానని ప్రకటించాడు. ఇక హారిక అండ్ హాసినిలో త్రివిక్రమ్‌కి కూడా భాగస్వామ్యం ఉందనే వార్తలు వస్తున్నాయి. 'అజ్ఞాతవాసి'తో డిజాస్టర్ అందుకున్న రాధాకృష్ణకి మరలా త్రివిక్రమే 'అరవింద సమేత వీరరాఘవ' వంటి బ్లాక్‌బస్టర్ అందించాడు. దీని తర్వాత త్రివిక్రమ్ అల్లుఅర్జున్, ఆ తర్వాత వెంకటేష్‌లతో సినిమాలు చేయనున్నాడు. మరి ఈ చిత్రాలు ఏ బేనర్‌లో రూపొందుతాయి? అనే విషయం బయటకు రానప్పటికీ బహుశా ఇవి రాధాకృష్ణకే అని అనుకుంటున్నారు.
అయితే త్రివిక్రమ్ ఆ తర్వాత మాత్రం నందమూరి కళ్యాణ్‌రామ్ బేనర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో నిర్మించే ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్‌రామ్ గానీ నటించరట. ఓ యంగ్ హీరోతో ఈ చిత్రం నిర్మితం కానుంది. 'అరవింద సమేత' చిత్రం షూటింగ్‌లో ఆయనకు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లతో మంచి అనుబంధం ఏర్పడింది. త్రివిక్రమ్ సహజంగా తనకు నచ్చిన హీరోలతోనే ఎక్కువగా రిపీట్ చిత్రాలు చేస్తూ ఉంటాడు. దానికి పవన్, మహేష్, బన్నీలు ఉదాహరణ. మరి ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో త్రివిక్రమ్ చేయబోయే చిత్రంలో హీరో ఎవరో తెలియాల్సివుంది..! 'కిక్ 2'తో బయటి హీరోలతో డిజాస్టర్ అందుకున్న కళ్యాణ్‌రామ్ 'జైలవకుశ' పుణ్యమా అని వాటిని పూడ్చుకున్నాడు. మరి తదుపరి ఆయన బేనర్‌లో చేయబోయే బయటి హీరో ఎవరో తెలియాల్సివుంది..!
By October 28, 2018 at 08:52AM
No comments