Breaking News

‘టాక్సీవాలా’కి ప్రమోషన్‌ మెటీరియల్‌ ఏది?


విజయ్‌ దేవరకొండ.. ఈయన రెండే రెండు చిత్రాలతో యూత్‌కి ఐకాన్‌గా మారాడు. ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ని సాధించాడు. ‘పెళ్లిచూపులు’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించినా కూడా ఆయనకు స్టార్‌స్టేటస్‌ని తీసుకొచ్చిన చిత్రాలు మాత్రం ‘అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’. ‘గీతగోవిందం’తో అతి తక్కువ వ్యవధిలో 100కోట్ల క్లబ్‌లో స్థానం సాధించాడు. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అనే చెప్పాలి. ‘శివ’ చిత్రం, అందులో నటించిన నాగార్జున, దర్శకుడు రాంగోపాల్‌వర్మలు ఎలా చిరస్థాయిగా నిలిచారో ఈ చిత్రం ద్వారా విజయ్‌దేవరకొండ, సందీప్‌రెడ్డివంగాలు అదే కోవకి చెందుతారు. ఈ చిత్రాన్ని తమిళంలో ఏకంగా దేశం గర్వించదగ్గ దర్శకుడు బాలా రీమేక్‌ చేస్తున్నాడంటే ఈ చిత్రం స్టామినా ఏమిటనేది అర్ధం అవుతుంది. 

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా ఈయన ఓ స్టార్‌గా అవతరించాడని మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు, అచ్చు చిరంజీవి తన కెరీర్‌ ప్రారంభంలో ఎలా ఎదిగాడో విజయ్‌ కూడా అలాగే ఎదుగుతున్నాడని అల్లుఅరవింద్‌ ప్రశంసలు పొందాడు. కానీ ఈయనకు ఇటీవల ఎన్నో అంచనాలతో వచ్చిన ‘నోటా’ పెద్ద షాక్‌నే ఇచ్చింది. మరోవైపు దీని కంటే ముందే ఆయన నటించిన ‘టాక్సీవాలా’ విడుదలలో పలు అవాంతరాలు ఎదుర్కొంది. సినిమాలోని కొంత భాగం లీక్‌ అవ్వడం కూడా సంచలనాలకు కేంద్రబిందువు అయింది. ఎట్టకేలకు ఈ మూవీ నవంబర్‌16న విడుదల కానుంది. ఈ చిత్రానికి కూడాకొత్త దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ మాత్రం గతంలో విజయ్‌ చిత్రాల కంటే కాస్త తక్కువగా సాగుతున్నాయి. ఎంత సేపు ‘మాటే వినదుగా’ అనే సాంగ్‌ చుట్టూనే ఇవి సాగుతున్నాయి. మొదట లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేసి తాజాగా ఒక నిమిషం వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఇలా విజయ్‌ దేవరకొండ చిత్రానికి ప్రమోషన్‌ మెటీరియల్‌ కొదువగా ఉందా? అనే అనుమనాలకు ఇది తావిస్తోంది. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ మూవీకి విజయ్‌ తరహా ప్రమోషన్స్‌ లభిస్తాయో లేదో వేచిచూడాల్సివుంది. మొత్తానికి ఈ చిత్ర విజయం మాత్రం విజయ్‌కి నోటావంటి డిజాస్టర్‌ తర్వాత అత్యంత కీలకమనే చెప్పాలి. 



By November 01, 2018 at 08:17AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43287/taxiwala.html

No comments