Breaking News

ఇదే స్టోరీ అయితే బాక్స్ బద్దలే..!!


విజయ్ - మురుగదాస్ కలయికలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సర్కార్ సినిమాపై కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోను భారీ అంచనాలున్నాయి. మురుగదాస్ డైరెక్షన్, విజయ నటన ఈ కాంబోలో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కావడంతోనే ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న సర్కార్ పై భారీగా అంచనాలు పెరిగాయి. ఇక విజయ్ తుపాకీ సినిమా నుండి తన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కెట్ సంపాదించాడు. కాకపోతే విజయ్ కత్తి రీమేక్ కోసమే టాలీవుడ్ పెద్దలు ఇక్కడ డబ్ కానివ్వలేదు. ఇక ఇప్పుడు సర్కార్ మీద టాలీవుడ్ పెద్దల కన్ను ఉన్నప్పటికీ.. విజయ్ - మురుగదాస్ లు మాత్రం సర్కార్ ని కోలీవుడ్ లో విడుదల సమయానికే అంటే దీవాళికే తెలుగులోనూ విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కలెక్టర్ పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా సర్కార్ కథ గురించి ఒక న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరి సర్కార్ టీజర్ లో చూపించినట్టుగా ఈ చిత్రంలో విజయ్ ఒక ఎన్ఆర్ఐ. పెద్ద వ్యాపారవేత్త అయిన విజయ్ ఏదైనా సరే పోటీ లేకుండా ఉండటం కోసం..  అవతలి వస్తువుని స్వాధీనం చేసుకునేంత వరకు నిద్రపోని రకం. ఆ పట్టుదల, అకుంఠిత దీక్షే విజయ్ ని సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ ని చేస్తుంది.  అయితే తన రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఇండియా వస్తాడు. విజయ్ పేరు మీదున్న ఓటు హక్కును నకిలీ వ్యక్తి వినియోగించేసుకుంటాడు. తన ఓటు హక్కు కోసం విజయ్ కోర్టుకు వెళతాడు. ఇక విజయ్ కి అనుకూలంగా కోర్టు తీర్పు రావడమే కాదు... మళ్ళీ ఆ నియోజక వర్గానికి ఎన్నికలు పెట్టాలని తీర్పునిస్తుంది కోర్టు. 

అయితే తన ఓటు కోసం కోర్టుకెళ్లిన విజయ్ ని చూసిన సీఎం రాధారవికి, భవిష్యత్తు నాయకురాలిగా కలలు కంటున్న కలెక్టర్ వరలక్ష్మికి అది రుచించదు. అనూహ్యంగా జరిగిన రాజకీయ పరిణామాల వల్ల విజయ్ సిఎంగా మారే పరిస్థితి వస్తుంది. కానీ విజయ్ సీఎం పీఠాన్ని అధిష్టిస్తాడా... లేదంటే తెరవెనుక ఉండి కథ నడిపిస్తాడా.. అనేది మాత్రం సర్కార్ కథలోని సస్పెన్స్ అంటున్నారు. మరి ఇదే కథ అయితే మురుగదాస్ మార్క్ డైరెక్షన్ తోడైతే సినిమా అదుర్స్ అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ దీపావళికి విజయ్ సర్కార్ వరల్డ్ వైడ్ గా విడుదలకాబోతుంది. 



By October 24, 2018 at 06:46AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43154/sarkar.html

No comments