బంటికి రాజేంద్రప్రసాద్ వాయిస్ ఓవర్
అదుగో.. రవిబాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా అదుగో టీంతో జత కలిసారు. ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీవాళి సందర్భంగా అదుగో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. పూర్తి ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీలకపాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకే రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఈయన వాయిస్ ఓవర్ అదుగో చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. థియేటర్స్ లో ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటుంది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన అదుగో ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. బంటిగా పందిపిల్ల అందరి మనసులను దోచేసింది. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రవిబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా కనిపించడానికి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ టెక్నాలజీని వాడుకున్నారు. ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాలజీ వాడుకోవడం ఇదే తొలిసారి. అభిషేక్ వర్మ, నభానటాష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థపై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
నటీనటులు:
అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి..
సాంకేతిక నిపుణులు:
కథ, దర్శకుడు: రవిబాబు
నిర్మాత: రవిబాబు
సంస్థ: ఫ్లైయింగ్ ఫ్రాగ్
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
స్క్రీన్‌ప్లే: సత్యానంద్
సంగీతం: ప‌్రశాంత్ ఆర్ విహార్
డిఓపి: ఎన్ సుధాకర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: నారాయణ రెడ్డి
ఎడిటర్: బల్ల సత్యనారాయణ
యాక్షన్: కనల్ కణ్ణన్, విజయ్, సతీష్
లిరిక్స్: భాస్కరబట్ల
మాటలు: రవిబాబు, నివాస్
పిఆర్ఓ: వంశీ శేఖర్
By October 29, 2018 at 01:35AM
No comments