రామ చక్కని సీతకు బాబీ సపోర్ట్
ఇంద్ర, సుకృత జంటగా క్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చక్కని సీత. విజయదశమి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేసారు. లోగో చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి కేశవ కిరణ్ సంగీతం అందిస్తుండగా.. మురుగన్ గోపాల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమతి విశాలలక్ష్మి మందా, జిఎల్ ఫనికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీహర్ష మందా ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే చిత్రయూనిట్ మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.
ఇంద్ర, సుకృత తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు: శ్రీహర్ష మంద, సంగీతం: కేశవ కిరణ్, సినిమాటోగ్రఫీ: మురుగన్ గోపాల్, నిర్మాతలు: శ్రీమతి విశాలలక్ష్మి మందా మరియు జిఎల్ ఫనికాంత్, నిర్మాణ సంస్థలు: క‌్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్.
By October 20, 2018 at 05:25AM
No comments