Breaking News

‘మీటూ’ జరుగుతున్నా.. నటిపై వేధింపులు!


ఒకవైపు ఇండియన్‌ సినీ హీరోయిన్లు ఎప్పటినుంచో లైంగిక వేధింపులపై గళమెత్తుతూ వస్తున్నారు. ముఖ్యంగా మలయాళ నటి కిడ్నాప్‌, రేప్‌ ఎటెంప్ట్ తర్వాత ఇలా స్వరమెత్తేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కానీ అంతకంటే ముందు రాధికాఆప్టే ఓ దక్షిణాది స్టార్‌, రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నాడే చెప్పింది. కంగనారౌనత్‌ నుంచి ఎందరో తమకు జరిగిన వేధింపులను చెప్పారు. ఆ తర్వాత అమలాపాల్‌ ఓ బడా వ్యాపారవేత్త తన స్నేహితునితో కలిసి డిన్నర్‌ చేయమని వేధించాడని, విదేశాలలో వేడుకలకు తాను వెళ్తున్న సందర్భంగా అక్కడ తన స్నేహితుని కోరికను తీర్చాలని వేధించాడని చెప్పి పోలీస్‌స్టేషన్‌ మెట్లు కూడా ఎక్కింది. నిజానికి ఆ తర్వాతనే హాలీవుడ్‌ కామపిశాచి అయిన హార్వే భాగోతం బయటకు వచ్చింది. 

తాజాగా 10ఏళ్ల కిందటే తాను తనకి జరిగిన లైంగిక వేధింపులు, అసభ్యప్రవర్తనను మీడియా ముందుకు తీసుకువచ్చానని.. కానీ నాడు తనని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో తన కెరీర్‌ నాశనం అయిందని, అతను ఎవరో కాదు.. దేశం గర్వించదగ్గ నటుడు నానాపాటేకర్‌ అని ‘వీరభద్ర’ ఫేమ్‌ తనుశ్రీదత్తా ప్రకటించడంతో మన దేశంలో కూడా మీటూ ఉద్యమం ఊపందుకుంది. అంతకు ముందే మీరాజాస్మిన్‌, నిత్యామీనన్‌ వంటి వారు కూడా వీటి గురించి చూచాయగా చెప్పే ఉన్నారు. ఇక ఈ మీటూ ఉద్యమం వల్ల జరిగిపోయిన వేధింపులు, నష్టాలు, కెరీర్‌ని కోల్పోవడం వంటివి మరలా తీసుకుని రాలేకపోయినా కనీసం ఇక నుంచైనా మృగాళ్లు ఇలాంటి వేధింపులకు భయపడతారని, దీని వల్ల రాబోయే తరాల వారైనా వీటి బారిన పడకుండా వీలవుతుందని పలువురు ఆశావహ దృక్పథంతో మీటూకి మద్దతు పలుకుతున్నారు. 

ఇక సుచీలీక్స్‌, శ్రీరెడ్డి వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా మీటూ వల్ల కూడా ఇలాంటి బరితెగించిన మృగాళ్లు భయపడటం లేదనే దానికి ఉదాహరణ మరొకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా ఇలాంటి సంఘటనలు ఆగకపోగా ఇంకా వేధింపులు సాగుతూనే ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. తెగించిన వాడికి తెడ్డే లింగం అనే పెద్దలు చెప్పిన సామెత వీరికి ఖచ్చితంగా సరిపోతుంది. తాజాగా తమిళ నటి రాణి లైంగికవేధింపులపై చెన్నైలోని పోలీస్‌స్టేషన్‌లో తన సహనటుడిపై ఫిర్యాదు చేసింది. తెలుగు, తమిళంలో మంచి నటిగా, సినీ, టివీ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాణి అలియాస్‌ రక్ష తెలుగులో మంచి ఇమేజ్‌ తెచ్చుకుంది. 

‘నచ్చావులే’ చిత్రానికి గాను ఈమె ఉత్తమ సహాయనటిగా నంది అవార్డును అందుకుంది. ఇలాంటి ప్రతిభ కలిగిన నటి ప్రస్తుతం ఓ తమిళ సీరియల్‌లో నటిస్తోంది. ఆ సీరియల్‌ చిత్రీకరణ సమయంలో సహనటుడు షణ్ముగరాజన్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడని రాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సెంగుడ్రమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈమె ఈమేరకు ఫిర్యాదు చేసింది. ఇది ప్రస్తుతం తమిళ సినీ టివి వర్గాలలో చర్చనీయాంశం అయింది. ఒకవైపు ఇంతగా లైంగికవేధింపులపై అందరిని కలవరపెడుతూ మీటూ ఉద్యమం జరుగుతున్న వేళ షణ్ముగరాజన్‌ అలా ఎందుకు ప్రవర్తించాడని కొందరు అంటుంటే.. ఆయనను తీవ్రంగా శిక్షించాల్సిందేనని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

తోటి నటీమణులందరు ఎంతో క్లోజ్‌గా బాబాయ్‌ అని పిలుచుకునే చలపతిరావు ఏదో ఒక మాట తప్పుగా మాట్లాడాడని పరిశ్రమలోని పెద్దలు, మహిళాసంఘాలు కేసులు, ఆందోళనలు చేశాయి. సహజంగానే చమత్కారంగా మాట్లాడే చలపతిరావు అందరినీ తన బిడ్డల్లాగా చూస్తాడు. ఆ విషయంలో మాత్రం మనవారు గోరంతను కొండతలు చేశారు. చివరకు తన భార్య మరణించినా తన జీవితం మొత్తం తన పిల్లలకోసమే ధారపోసి కనీసం రెండో వివాహం కూడా చేసుకోని గొప్ప మనసున్న చలపతిరావు కుమారుడు దర్శకుడు, నటుడు రఘుబాబు సైతం ఆవేదనతో మానాన్నకి మదమెక్కి మాట్లాడాడు. ఈ వయసులో ఆయనను మాటలతో హింసించే కంటే చంపేయండి అని ఆవేదన చెందాడు. మరి ఇప్పుడు ఆ అభ్యుదయ వాదులందరు ఎక్కడ కాలక్షేపాలు చేస్తున్నారో ఏమో మరి...! 



By October 18, 2018 at 09:21AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43064/metoo.html

No comments