తనుశ్రీకి పిచ్చిపట్టిందంటున్న హాట్ భామ
దేశం గర్వించదగ్గ నటుడే కాదు.. సంఘ సేవకునిగా నానా పాటేకర్‌కి ఎంతో పేరుంది. ఆయన ద్వారా సాయం పొందిన మహారాష్ట్రలోని రైతులు ఆయనను దేవుడిలా కొలుస్తారు. తన తల్లితో కలిసి ఓ చిన్న గదిలో ఉండే ఆయన ఎప్పుడు ఎంతో నిరాడంబరంగా ఉంటారు. ఆయన వ్యక్తిత్వాన్ని రజనీకాంత్ వంటి వారు కూడా ఎంతో మెచ్చుకుంటారు. అలాంటి సమాజంలోని గొప్ప వ్యక్తిపై నటి తనుశ్రీదత్తా లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. మొత్తానికి ఇది నిజమో కాదో తెలియదు కానీ దీని వల్ల నేడు నటీమణులందరు తమకు జరిగిన వేధింపులు, లైంగిక హింసలపై పెదవి విప్పుతున్నారు. ఇందులో కొందరు పబ్లిసిటీ కోసం ప్రముఖులపై బురద జల్లేవారు కూడా ఉంటారని, మరికొందరు నిజమైన బాధితులు ఉంటారనే విషయాలు కూడా నిజమే. అందుకే కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి వారు తాము కూడా 'మీటు' ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని, తమ వంతు సాయం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు.
ఇలాంటి ఉద్యమం మనదేశంలో ప్రారంభం కావడం వల్ల మహిళలకు మేలు జరుగుతుందని, భవిష్యత్తులో స్త్రీలు పనిచేసే చోట వారికి రక్షణ కలిగించే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. అయితే ఈ ఉద్యమాన్ని నిజాయితీగా వాడుకోవాలని, ఎదుటి వారిపై కక్ష్యసాధింపు, పబ్లిసిటీకి వాడుకోకూడదని వారు హితవు చెప్పారు. ఇక తనుశ్రీ దత్తా - నాపా పాటేకర్‌ల వివాదంలో తనుశ్రీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై ఈ వేధింపులు జరిగాయని చెబుతున్న చిత్రంలో నుంచి తనుశ్రీ దత్తా తప్పుకోగా, ఆ స్థానంలో నటించిన శృంగార నటి రాఖీ సావంత్ స్పందించింది. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లు కోమాలో ఉండి... ఇప్పుడు బయటకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది.
పదేళ్లు అమెరికాలో ఎంజాయ్ చేసి వచ్చిన ఆమెకి ఇప్పుడు నానా పాటేకర్ గుర్తుకు వచ్చాడు. ఇదంతా పబ్లిసిటీ కోసం ఆమె చేస్తున్న ఎత్తుగడ, కావాలని నానా పాటేకర్‌ని లక్ష్యంగా చేసుకుంది. తనుశ్రీ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆమె చెప్పినట్లుగా ఆ షూటింగ్‌లో ఏమీ జరగలేదని తానే సాక్షిగా చెబుతూ తనుశ్రీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఈ విషయంలో కూడా ఏమైనా లోగుట్టు ఉందా? అనిపిస్తోంది. అయినా లోగుట్టు పెరుమాళ్ల కెరుక అనే చెప్పాలి.
By October 24, 2018 at 02:35PM
No comments