‘వీరభోగ వసంతరాయలు’.. పెద్ద తప్పు చేశారు
గత వారం విడుదలైన హలో గురు ప్రేమకోసమే, పందెం కోడి 2 సినిమాలకు యావరేజ్ టాక్ రావడంతో.. నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు,శ్రియ కాంబోలో తెరకెక్కిన వీర భోగ వసంత రాయులు సినిమాని రేపు శుక్రవారం విడుదల చేయానికి ప్లాన్ చేశారు. ఆయితే సినిమా మీదున్న విపరీతమైన నమ్మకంతో నిన్ననే ఓవర్సీస్ ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. అసలే పూర్ ప్రమోషన్స్‌తో ఉన్న ఈ సినిమాకి ఓవర్సీస్‌తో మరింత దెబ్బపడిందనే చెప్పాలి. నూతన దర్శకుడు ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రీయ నటించారు. అయితే దర్శకుడు ఇంద్రసేనతో వచ్చిన విభేదాలతో హీరో సుధీర్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్‌ని పక్కనబెట్టి విదేశాలకు చెక్కేసాడు. ఇక మిగతా వారు కూడా ఈ సినిమాని లైట్ తీసుకున్నారు కాబట్టే.. ఈ సినిమా గురించిన విషయాలేమి ప్రేక్షకులకు తెలియడం లేదు. ఇకపోతే నిన్న ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమా టాక్ పూర్తిగా నెగెటివ్ గా ఉండడంతో సినిమాకి ఇక్కడ ఓవరాల్ గా దెబ్బపడినట్లే.
అసలు ఈ సినిమా కథ ఎలా వుంది అంటే...నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ ముగ్గురు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ . ఈ ముగ్గురు ఆఫీసర్స్ డిఫ్రెంట్ మిస్టరీ కేసులను డీల్ చేస్తారు. అసలా కేసులేమిటి? ఈ సినిమాకి వీర భోగ వసంత రాయలు అని పేరెలా వచ్చిందో? అనేది మిగతా కథగా తెలుస్తుంది. మరి అక్కడే ఓవర్సీస్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇక్కడేం హిట్ అవుతుంది. అసలు సినిమాలో చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ ఏం లేవని ఓవర్సీస్ క్రిటిక్స్ చెబుతున్నమాట. చివరి పదిహేను నిమిషాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించినా సినిమా మొదటినుండి అంటే టైటిల్స్ నుండి ఆసక్తికరంగా లేకపోవడంతో ఆ పదిహేను నిమిషాల ఫీలింగ్ కూడా ఫైనల్ గా ఉండదని అంటున్నారు. ఇక సినిమాలో కథ, కథనం అన్ని వీక్ గా వుండడమేకాదు... నిర్మాణవిలువలు మరీ ఘోరంగా ఉన్నాయంటున్నారు. ఆసక్తిలేని సీన్స్ బోర్ కొట్టించాయని.. అంతమంది స్టార్ కాస్ట్ ఉన్న సినిమాకి పని జరగలేదంటున్నారు.
క్రైమ్ అనే ఎలిమెంట్ చుట్టూ శ్రీవిష్ణుతో చేయించిన ఒక వెరైటీ పాత్ర ద్వారా దర్శకుడు ఇంద్రసేన ఇవ్వాలనుకున్న మెసేజ్ పూర్ స్క్రీన్ ప్లే వల్ల దెబ్బ తింది. సుధీర్ బాబు డబ్బింగ్ చెప్పకుండా ఎందుకు మొరాయించాడో థియేటర్ నుంచి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతాడు. అలాగే శ్రీ విష్ణు విచిత్రమైన గెటప్ తో ఎందుకు ఉంటాడో....అర్థం లేని డిమాండ్ తో ఏం సాధించాలనుకుంటాడో అర్ధమయ్యే లోపే సినిమా అయిపోతుంది.
అసలు ఏం చూసి ఈసినిమాను నారా రోహిత్, శ్రీయ, సుధీర్ బాబు ఒప్పుకొన్నారో అనే డౌట్ సినిమా చూస్తే తప్పక కలుగుతుంది. ఇక బరువైన పాత్రలో నటించిన శ్రీ విష్ణు ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. మరి ఇప్పటికే నారా రోహిత్ కి బలమైన బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ సినిమాకి అసలు బిజినెస్ జరగలేదని... అంటున్నారు. మరి అలాంటి టైం లో ఓవర్సీస్ లో ముందు విడుదల చేసి ఇక్కడ విడుదల చెయ్యకుండా నిర్మాతలు తప్పు చేశారనిపిస్తుంది. శుక్రవారమే రెండు చోట్ల విడుదల చేస్తే టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగుండేవని... ఇప్పుడు అక్కడ వచ్చిన టాక్‌తో ఇక్కడ ఘోరమైన ఓపెనింగ్స్ ని వీర భోగ వసంతరాయులు సొంతం చేసుకుంటుందని అంటున్నారు. చూద్దాం రేపు శుక్రవారం ఈ సినిమా పరిస్థితి ఇక్కడ ఎలా ఉండబోతుందో అనేది?
By October 26, 2018 at 05:00AM
No comments