Breaking News

‘శ్రీమంతుడు’ క్లైమాక్స్ ఇలా మారిస్తే..!!


 

తెలుగు రచయితల్లో దిగ్గజాలుగా పరుచూరి బ్రదర్స్‌ని చెప్పవచ్చు. వారి చిత్రాలలో ఎంతటి స్టార్స్‌ ఉన్నా, ఎంతో మేసేజ్‌ చెప్పినా కూడా హీరోయిజం మాత్రం తగ్గకుండా హీరోల అభిమానులను ఖుషీ చేసే విధంగా చూసుకుంటారు. ఇక ఇటీవల పరుచూరి గోపాలకృష్ణ తమ అనుభవాలను, ఇతర చిత్రాలలోని అంశాలను నేటితరం దర్శకులకు, కాబోయే దర్శకులకు కూడా దిక్సూచిగా విలువైన సూచనలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఆయన మహేష్‌బాబు-కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్‌ చిత్రం 'శ్రీమంతుడు' క్లైమాక్స్‌ గురించి తనదైన అనుభవంతో మరోలా క్లైమాక్స్‌ని ఎలా తీయాలో వివరించాడు. నిజానికి 'శ్రీమంతుడు' చిత్రం క్లైమాక్స్‌ మహేష్‌ అభిమానులకు నచ్చే అంశాలు లేవు. అందుకే మొదటి రెండు రోజులు మహేష్‌ ఫ్యాన్స్‌ కూడా క్లైమాక్స్‌ ఇంకా బాగా తీసి ఉండాల్సింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగని కొరటాల చూపించిన క్లైమాక్స్‌ బాగా లేదని మాత్రం చెప్పలేం. 

అయితే దీనిని అభిమానులకు మరింత రంజింపజేసేలా తీయడం ఎలాగో పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం క్లైమాక్స్‌లో మహేష్‌ విలన్‌ గ్యాంగుని ఫ్యాక్టరీలో పెట్టి ఫ్యాక్టరీని తగుల బెట్టడం అనేది కొందరికి ఐ జర్కులా అనిపించింది. నిజానికి ఈ క్లైమాక్స్‌ మరో విధంగా తీసి అందరినీ మెప్పించేలా తీయవచ్చు. మేనేజర్‌ కూతురి వివాహానికి ఏకంగా 20లక్షలు ఇచ్చిన ఉదాత్తమైన మంచి మనసున్న వాడు హీరో. మరి ఇంతటి హింసను అతను చేయగలడా? అనే అనుమానం వస్తే మరోలా తీయవచ్చు. 'మూడు వేలమంది ఉన్నారు. 30మందిని ఎదుర్కోలేరా? అని మహేష్‌ గ్రామస్థులకు ధైర్యం నూరిపోయాలి. దాంతో వాళ్లంతా ఒక్కసారిగా విలన్‌ గ్యాంగ్‌పై దాడికి దిగుతారు. ప్రధానమైన విలన్స్‌తో మహేష్‌ పోరాడుతాడు. క్షమించమని విలన్లు మహేష్‌ కాళ్లు పట్టుకుంటారు. కట్‌ చేస్తే ఎప్పటిలానే ఆ ఊరికి బస్సు వస్తుంది. ఆ ఊరి జనం, మహేష్‌బాబు చూస్తుండగా ఆ విలన్‌గ్యాంగ్‌ బస్సులోకి ఎక్కి ఆ ఊరి నుంచి వెళ్లిపోతుంది. 

అప్పుడు మహేష్‌బాబు 'ఇక ఊరి నుంచి వెళ్లవలసిన వారు ఎవ్వరూ లేరు. వెళ్లిపోవాల్సిన వారు వెళ్లిపోయారు' అంటాడు. మరలా అలాంటి వారు ఆ గ్రామానికి వస్తే ఏం చేయాలో కూడా మహేష్‌ తన గ్రామస్తులకి ఆల్‌రెడీ నేర్పాడు.. చూపించాడు. కాబట్టి ఈ గ్రామంలో ఇక అలాంటి సమస్యరాదని చెబుతూ, సినిమాని ముగించవచ్చు అని చెప్పాడు. 



By October 23, 2018 at 08:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43143/paruchuri-gopala-krishna.html

No comments