రాయలసీమ సొగసును చూపించా: త్రివిక్రమ్
‘అరవిందసమేత వీరరాఘవ’ విడుదల సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘మన పురాణాలు, సాహిత్యాలలో ఏదైనా శుభం అంటే మంగళంతో ప్రారంభమై, మంగళంతోనే ముగుస్తుంది. కానీ నేడు అంతా అమంగళమే. టివి ఆన్‌చేస్తే యాక్సిడెంట్లు, మరణాలనవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వార్తలు విని, చదివి మనం రాటుదేలిపోయాం. కానీ మన పూర్వీకుల రచనల్లో రొమాన్స్, శృంగారం బాగా కనిపిస్తాయి.
అంటే వారు జీవితాన్ని అంత గొప్పగా జీవించారేమో..! అలాంటి జీవితాన్ని ఆస్వాదించారేమో..! బయటి ప్రపంచం తాలూకు ఘటనలే సినిమాలలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అప్పట్లో రాచరికం, తర్వాత రెండవ ప్రపంచయుద్దం, ఆ తర్వాత నిరుద్యోగ సమస్యల వంటివి మన సినిమాలలో కనిపిస్తూ ఉంటాయి. ‘అరవింద..’ చిత్రం సందర్భంగా రాయలసీమ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. తిరుమల రామచంద్రరావు గారి సాహిత్యం చూశాను. పెంచలదాస్‌ని ఓ పాట పాడటం కోసం పిలిచాను. ఆ తర్వాత ఆయన డైలాగ్స్ రాయడంలో కూడా సాయంగా ఉన్నారు. రీసెర్చ్‌లో భాగంగా ఎందరినో కలసి మరెన్నో విషయాలు తెలుసుకున్నాం.
రాయలసీమ వారు ఉన్నారు గానీ వారిలో రాయలసీమ లేదు. కానీ పెంచలదాస్‌లో మాత్రం రాయలసీమ ఎంతో ఉంది. సినిమాలో ఎన్టీఆర్ చాలా తక్కువగా మాట్లాడుతాడు. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌లో అయితే చాలా తక్కువడైలాగ్స్ ఉంటాయి. అలాగే సందర్భానుసారమే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రం అంటే సాధారణంగా హింసను గ్లోరిఫై చేసేలా ఉంటుంది. కానీ అదొక్కటే కాదు.. ఇందులో రాయలసీమ సొగసును చూపించాం.. అని చెప్పుకొచ్చాడు.
By October 11, 2018 at 06:36AM
No comments