Breaking News

శివబాలాజీ కొట్టలేనిది.. కౌశల్ కొడతాడా?


బిగ్ బాస్ సీజన్  2 అయిపోయింది . టైటిల్ విన్నర్ కౌశల్ అయ్యాడు. మొన్న ఆదివారం జరిగిన ఫైనల్ లో వెంకటేష్ చేతులు మీదగా బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీని అందుకున్నాడు కౌశల్. సీజన్ మొదటిలో కౌశల్ ని ఎవరు పట్టించుకునే వారు కాదు. కిరీటి చేసిన ఓ తప్పు కౌశల్ జీవితాన్నే మార్చేసింది. దానికి తోడు నేను ఒంటరి అని టాగ్ లైన్ పెట్టుకోవటం.. హౌస్ లో జరిగిన ప‌రిణామ‌ల దృష్ట్యా.. బిగ్ బాస్ అంతా ఓ వైపు కౌశ‌ల్ మ‌రో వైపూ అన్న‌ట్టు త‌యారైంది వ్వ‌వ‌హారం. 

దాంతో మనవాడికి సోషల్ మీడియాలో సింపతీ పెరుగుతూ... ఫ్యాన్స్ గా ఏర్పడి కౌశల్ ఆర్మీ అని క్రియేట్ చేసి కౌశల్ ని విన్ అయ్యేలా చేశారు. కౌశల్ విన్ అవ్వటానికి కారణం కౌశల్ ఆర్మీనే అని చెప్పాలి. వచ్చిన ప్రైజ్ మ‌నీ ద్వారానే రూ.50 ల‌క్ష‌ల్నీ కాన్స‌ర్ బాధితుల స‌హాయార్థం ఉప‌యోగిస్తాన‌ని చెప్పి మరోసారి అందరి మనసులు గెలుచుకున్నాడు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కౌశల్ టార్గెట్ సినీ ఇండస్ట్రీపై పడింది. ఒకప్పుడు చిన్నచిన్న పాత్రలు పోషించడం.. టీవీ సీరియల్స్ ప్ర‌తినాయ‌కుడిగా కౌశ‌ల్ ప్ర‌సిద్ది పొందాడు. అయితే బిగ్ బాస్ తో తనకు ఓ గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు వచ్చే అవకాశముంది. గత సీజన్ విన్న‌ర్ శివ బాలాజీకి బిగ్ బాస్ ద్వారా వ‌చ్చిన ప్ర‌త్యేక‌మైన మైలేజీ ఏమీ లేదు. కానీ కౌశల్ పరిస్థితి వేరు. అతనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. కానీ హీరోగా కాదు. కీల‌క పాత్ర‌లు, ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లూ చేస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. సో అతని ఫ్యూచర్ బాగుండాలి అని కోరుకుందాం.



By October 03, 2018 at 12:57PM

Read More

No comments