Breaking News

నాగ్‌, సమంత, చైతూ.. ఇప్పుడేం చెబుతారు?


నాగార్జునకు వయసు పెరుగుతున్న కొద్ది హ్యాండ్సమ్‌ లుక్‌ పెరుగుతున్న మాట వాస్తవమే గానీ కొన్ని విషయాలలో ఆయన ప్రవర్తన,మాట తీరులో సమతుల్యం పోతోంది. ఎంతటి ఆయన అభిమాని అయినా దానిని ఒప్పుకోవాలి. నాగచైతన్య విషయంలో ఆయన మొదటి చిత్రం ‘జోష్‌’ని దిల్‌రాజు చేతుల్లో పెట్టి ఓ దర్శకుడిని నమ్మడం వల్ల తప్పుచేశానని, అఖిల్‌ విషయంలో ఆ పని చేయనని చెప్పిన ఆయన అఖిల్‌కి కూడా ‘అఖిల్‌’ చిత్రం ద్వారా స్వేచ్చఇచ్చాడు. అలాగని ఆయన ఎన్నో కథలు విని చివరకు ఓకే చేసిన ‘హలో’ చిత్రం సైతం ‘మనసంతానువ్వే’కి లేటెస్ట్‌ వెర్షన్‌ అనేది మర్చిపోయాడు. 

ఇక ఈయన నటించిన చిత్రాలైన ‘షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ, రాజుగారిగది 2’ తోపాటు.. తాజాగా ‘దేవదాస్‌’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్ల విషయంలో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ‘యూటర్న్‌’ చిత్రాలు కూడా ఆశించిన కలెక్షన్లు సాధించలేకపోయాయి. ఇవి వ్యక్తిగతంగా వారికి మంచి చిత్రాలు అనిపించవచ్చు గానీ నిర్మాతలను, బయ్యర్లను నష్టపరుస్తున్నాయనే చెప్పాలి. 

ఇకవిషయానికి వస్తే నాగార్జున కుటుంబం స్పెయిన్‌లోని ఐబిజా ట్రిప్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘దేవదాస్‌’ విడుదలకు ముందు రోజే నాగ్‌ ఇందులో జాయిన్‌ అయ్యాడు. ‘దేవదాస్‌’ ఇచ్చిన విజయంతో ఈ ట్రిప్‌ని మరింతగా ఎంజాయ్‌ చేస్తున్నానని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. సక్సెస్‌ దరి చేరడం వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులతో చేస్తున్న విహారయాత్ర మరింత సరదాగా ఉందని చెప్పిన ఆయన, ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో నాగార్జున, ఆయన భార్య అమల, నాగచైతన్య-సమంత జంట, అఖిల్‌ తదితరులు ఉన్నారు. ఒకప్పుడు సినిమా ఆర్థిక విజయం సాధిస్తేనే నిజమైన విజయమని, అదే తనకి ముఖ్యమని చెప్పిన నాగ్‌, సమంత, నాగచైతన్యలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో వేచిచూడాల్సివుంది..! 



By October 03, 2018 at 09:13AM

Read More

No comments