డైరెక్టర్ పై ప్రభాస్ హీరోయిన్ తీవ్రఆరోపణలు
రోజురోజుకి 'మీటూ' ఉద్యమం వైరల్ అవుతోంది. చాలా మంది నటీమణులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమపై జరిగిన వేధింపులను బయట పెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి 'బుజ్జిగాడు' చిత్రంతో ప్రభాస్‌కి రెండో హీరోయిన్‌గా నటించిన ఆ తర్వాత 'సత్యమేవ జయతే, పోలీస్‌పోలీస్, సమర్దుడు, ముగ్గురు, యమహోయమ:, నేనేం...చిన్నపిల్లనా?, జగన్ నిర్ధోషి, అవును, సర్దార్‌గబ్బర్‌సింగ్, దండుపాళ్యం2, దండుపాళ్యం 3' వంటి చిత్రాలలో నటించిన సంజనా గిర్లాని చేరింది. జాన్ అబ్రహాంతో చేసిన ఫాస్ట్‌ట్రాక్ యాడ్ ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈమె మొదట్లో 60కి పైగా కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. బెంగుళూరుకి చెందిన ఈ సింధీ యువతి అసలు పేరు అర్చనా గిర్లాని. ఇక ఈమె మొదటి చిత్రం కన్నడలో బాలీవుడ్ 'మర్డర్'కి రీమేక్‌గా తెరకెక్కిన 'గండహెందాతి' ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
తాజాగా ఈమె మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్‌లో జరిగిన వేధింపుల గురించి వివరించింది. చిత్ర పరిశ్రమలో తీవ్ర వేధింపులకు గురయ్యాను. హిందీలో వచ్చిన 'మర్డర్' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసిన దర్శకుడు తాను చెప్పినట్లు వినకపోతే నా కెరీర్‌నే పూర్తిగా నాశనం చేస్తానని బెదిరించాడని బాంబ్ పేల్చింది. తమిళ, తెలుగు, కన్నడలో పలు భాషల్లో నటించిన ఈమె సోదరి నిక్కీ గిర్లానీ కూడా ప్రముఖ నటే కావడం గమనార్హం. ఈమె ఇంకా మాట్లాడుతూ, నాకు నటిగా తొలి అవకాశం కన్నడలోనే వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు నాకు హిందీ 'మర్డర్' సినిమాని చూపి దానిని రీమేక్ చేయబోతున్నట్లు చెప్పాడు. ఆ చిత్రంలోని పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉండటంతో వాటిని మార్పు చేస్తే గానీ నటించనని చెప్పాను. దానికి దర్శకుడు అంగీకరించాడు. షూటింగ్ కోసం అమ్మతో కలిసి షూటింగ్‌కి బ్యాంకాక్ వెళ్లాను. అక్కడ అమ్మని షూటింగ్ స్పాట్ వద్దకు తీసుకుని రావద్దని బెదిరించాడు. అక్కడ ఓ ముద్దు సన్నివేశం అని చెప్పి, నాతో కొన్ని అశ్లీలమైన సన్నివేశాలు చిత్రీకరించాడు. చిత్రపరిశ్రమకు ఒక విజన్‌తో వచ్చిన నన్ను ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారు. లైంగికంగా వేధించారు' అని వాపోయింది.
దీనిపై ఆ చిత్ర దర్శకుడు స్పందిస్తూ.. చాలా మంది అమ్మాయిలు తమ కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం అన్ని రకాల పాత్రలు చేస్తారు. కాస్త ఎదిగామని భావించిన తర్వాత తాము కెరీర్ మొదట్లో చేసిన కొన్ని చిత్రాలపై, వాటి దర్శకులపై ఈ రకమైన ఆరోపణలు చేయడం సహజమైపోవడం బాధాకరమని వ్యాఖ్యానించడం గమనార్హం.
By October 25, 2018 at 03:10AM
No comments