Breaking News

‘సైరా’.. మెగాభిమానులకు నిరాశే వద్దు


మెగాస్టార్‌ చిరంజీవి.. ఈయన నటించిన ‘పున్నమినాగు, చంటబ్బాయ్‌, రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఆరాధన’ వంటి చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అయితే ‘పున్నమినాగు’ సమయానికి ఆయనకు పెద్దగా ఇమేజ్‌ లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈయనకు బాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగే సమయంలో మాత్రం అందరూ ఆయన నుంచి భారీ యాక్షన్‌, డ్యాన్స్‌లను బాగా ఆశించేవారు. అవి అందించకలేకపోవడం వల్ల వీటిల్లో కొన్ని చిత్రాలు అద్భుతమైన ఆణిముత్యాలే అయినప్పటికీ సగటు చిరు అభిమానిని అవి ఆకట్టుకోలేకపోయాయి. అప్పటి నుంచి చిరంజీవి తన చిత్రాలలో యాక్షన్‌, సాంగ్స్‌ విషయంలో రాజీ పడకుండా అభిమానులను దృష్టిలో పెట్టుకుంటూ ఉండేవాడు. 

దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ షష్టిపూర్తి వయసులో కూడా ఆయన నటించిన 150వ చిత్రం ‘ఖైదీనెంబర్‌150’ చిత్రంలో డ్యాన్స్‌, ఫైట్స్‌లో తన గ్రేస్‌ చూపించాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ అయిన ‘సై..రా...నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర పూర్వం జరిగిన తొలి స్వాతంత్య్ర సమరయోధుని కథ కావడంతో ఇందులో పోరాట దృశ్యాలకు కొదువ ఉండకపోయినా ఇలాంటి చిత్రంలో డ్యూయెట్స్‌ ఎంత వరకు ఉంటాయి? అనే అనుమానం అందరికీ కలుగుతోంది. దాంతో ఇందులో చిరుకి స్టెప్స్‌, డ్యూయెట్స్‌ ఉండకపోవచ్చనే ప్రచారం మొదలైంది. కానీ నయనతార, తమన్నా ఇందులో నటిస్తుండే సరికి ఏదో ఒక మూల ఆ ఆశ ఉండనే ఉండనుంది. 

అయితే కథ నేపధ్యంలోనే సాంగ్స్‌ కూడా ఉంటాయని, ఈ విషయంలో అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. చిరంజీవిపై చిత్రీకరించే పాటలకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించనున్నాడట. అయితే ఈ డ్యాన్స్‌లు ఇప్పటివరకు తాను చేసిన సాంగ్‌లోని స్టెప్స్‌కంటే డిఫరెంట్‌గా మరింత కొత్తదనంగా ఉండాలని చిరు శేఖర్‌ మాస్టర్‌కి సూచించాడని సమాచారం. అందుకే శేఖర్‌ మాస్టర్‌ సరికొత్తగా ఉండే స్టెప్ప్సు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడట. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయిమాధవ్‌బుర్రా సంభాషణలు, శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ కంపోజింగ్‌లు హైలైట్‌గా నిలుస్తాయనే టాక్‌ వినిపిస్తోంది. సో.. ఈ విషయంలో మెగాభిమానులు నిరాశ చెందాల్సిన పనిలేదనే చెప్పాలి. 



By October 30, 2018 at 06:53AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43252/chiranjeevi.html

No comments