మనోజ్ లేఖ: రాగి సంగటి, మటన్ పులుసు
మంచు మనోజ్ నటించిన సినిమాల్ని వరుసబెట్టి ఫసక్ అవుతున్నాయి. ఒక్కడు మిగిలాడు సినిమా ప్లాప్ తరువాత సినిమాలకు బై బై చెబుతున్నానంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన తక్షణం డిలేట్ చేసి షాకిచ్చిన మనోజ్ మంచు ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకోకుండా.. లైఫ్ ని భార్యతో, ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మనోజ్ లో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ... అధిక బరువు వలన, అదృష్టం లేకపోవడం వలన స్టార్ హీరో రేంజ్ అందుకోలేకపోయారు. అయితే సినిమాలు వదిలేశాడా మనోజ్ అని అందరు మనోజ్ ని అడుగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆన్సర్ దాటవేస్తున్నాడు. ఇక మొన్నీమధ్యనే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు తోడుగా అభిమానుల తోపులాట నుండి ఒక బౌన్సర్ లా వారికి రక్షణ ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు.
ప్రస్తుతం సినిమాలు, బిజినెస్ లేకుండా ఖాళీగా ఉన్న మంచు మనోజ్ రాజకీయాల వైపు చూస్తున్నాడా? ఏమో అయ్యుండొచ్చు అనే మాట వినబడుతుంది. ఇప్పటివరకు మంచు మోహన్ బాబు అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉంటూనే ఏ పార్టీకి పచ్చ జెండా ఊపకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. మంచు లక్ష్మి కూడా అంతే. మరి ఈ టైంలో మోహన్ బాబు రాజకీయాల్లో యాక్టీవ్ గా లేనప్పుడు మనోజ్ మాత్రం రాజకీయాల్లోకి వెళితే అనే అనుమానం కలగక మానదు. మరి మనోజ్ రాసిన ఒక లెటర్ చూస్తుంటే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయంగానే కనబడుతుంది. సేవ – లక్ష్యం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మనోజ్ రాజకీయాల మీద ఆసక్తిని తెలియజేస్తుంది.
ఇంతకీ మనోజ్ రాసిన ఆ లెటర్ సారాంశం ఏమిటంటే... మన ప్రతీ లక్ష్యానికీ ఓ గోల్ ఉండాలి… ఆ గోల్ యెక్క లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్దరించేలా ఉండాలి... అంటూ ఓ సుదీర్ఘమైన లేఖ రాశాడు మనోజ్. దాని సారాంశం ఏమిటంటే…. మనోజ్ త్వరలో రాయలసీమ షిఫ్ట్ అవుతున్నాడట. తిరుపతిలో కొన్ని నెలల కోసం ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తిరుపతిలో తనకు ప్రశాంతత దొరికిందని.... అక్కడ ఉంటూ… రైతులకు, వాళ్ల పిల్లలకు సేవ చేస్తానని లేఖలో రాసుకొచ్చాడు. అంతేకాదు… ఇంకా మనోజ్ ఏమంటున్నాడంటే... తన సేవ కేవలం రాయలసీమకే పరిమితం కాదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకూ సేవ చేస్తానని.... అయితే ఇంతలో తన సినీ, రాజకీయ జీవితంపై ఎవరూ ఎలాంటి తీర్మాణాలు చేయొద్దని మరీ కోరుతున్నాడు. అలాగే ప్రజలకు సేవ చేస్తూనే సినిమాలు కూడా చేస్తానని.... సినిమాలపై తనకున్న ప్రేమ, దాహం తగ్గదని చెబుతున్నాడు. మరి మనోజ్ సినిమాలు చేస్తూనే రాజకీయాలను కూడా చక్కబెడతాడేమో చూద్దాం.
By October 22, 2018 at 03:13PM
No comments