Breaking News

అమలా హగ్ ఇస్తుంటే.. డైరెక్టర్ ఏం చేశాడంటే?


ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమం దేశాన్ని ఓ ఊపు ఊపుతోంది. ముక్కుమొహం తెలియని ఆడవారిని కూడా లైంగికంగా వేధించడం, గదిలోకి రమ్మన్నారనే ఆరోపణలతో దేశం ఉలిక్కిపడుతోంది. ఈ ఉద్యమంలో ఎందరి పేర్లు బయటకి వస్తాయో? అందులో తమ పేరు కూడా ఉంటుందేమో అని పలువురు కలవరపడుతున్నారు. కానీ మగాళ్లలలో, సినీ పరిశ్రమలో కూడా ఎంతో మంచి వారు ఉన్నారు. అందునా ఫైర్‌బ్రాండ్‌ వంటి అమలాపాల్‌ చెప్పిందంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. గతంలో ఆమె తన సహనటుడు బాబీసింహా కూడా తనతో రొమాంటిక్‌ సీన్స్‌లో చాలా సిగ్గుపడ్డాడని తెలిపింది. తాజాగా మరో దర్శకునికి ఆమె మంచి కాంప్లిమెంట్‌ వచ్చింది. 

ఈరోజుల్లో యువతీ యువకులు కౌగిలించుకోవడం సర్వసాధారణమైపోయింది. ఇక సినీ రంగంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. అలా ఓ హీరోయిన్‌ ఓ డైరెక్టర్‌కి హగ్‌ ఇస్తుంటే కంగారు పడి తప్పించుకున్నాడు. అతనే యువ దర్శకుడు రామ్‌కుమార్‌. ఆమె తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఇతని ‘రాక్షసన్‌’ చిత్రంలో నేను హీరోయిన్‌గా చేశాను. దర్శకుడు రామ్‌కుమార్‌ ఎంతో మంచి వ్యక్తి. అంతేకాదు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. ఎంతో కష్టపడి పనిచేసిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తికావడంతో సంతోషంగా అతడిని కౌగిలించుకోబోయాను. ఆయన కాస్త కంగారు పడి వెనక్కి వెళ్లిపోయాడు. ఆయన ‘ముండాసిపట్టు’ చిత్రం సక్సెస్‌ తర్వాతనే పెళ్లిచేసుకోవాల్సివుంది. ఈ ‘రాక్షసన్‌’ చిత్రం తర్వాత ఆయనకు పిల్ల దొరకడం కష్టమే’’ అని సెటైర్‌ వేసింది. 

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘నిజంగా రామ్‌ చాలా మంచి వ్యక్తి. ఆయనకు త్వరలోనే మంచి జీవితభాగస్వామి లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇక ‘మీటూ’ ఉద్యమం గురించి చర్చ జరుగుతోంది. నిజానికి దీని గురించి మొదట ట్వీట్‌ చేసిన వ్యక్తిని నేనే. ఫిబ్రవరిలో నాపై లైంగిక వేధింపులు జరిగినప్పుడే దీనిపై గళం విప్పాను. ఆ తర్వాత మీటు ఉద్యమం అంతర్జాతీయంగా ప్రాచుర్యం అయింది. మీటూ అనేది మంచి విషయం. ఇది ఇంకా విస్తరించాలి. 18ఏళ్ల వయసులోనే నేను ఈ రంగంలోకి వచ్చాను. నటించడానికి వచ్చినప్పుడే పెద్ద నటిని కావాలని కోరుకున్నాను. అయితే ఆ పేరు తెచ్చుకోవడానికి 8ఏళ్లు పట్టింది. మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే నాకిష్టం. ఇకపై నటనకు బ్రేక్‌ ఇవ్వను. చిత్రపరిశ్రమే నాకు తల్లితండ్రి. చిత్రాలను, పాత్రలను ఆస్వాదిస్తూ నటిస్తాను..’’ అని చెప్పుకొచ్చింది. 



By October 17, 2018 at 01:21PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43058/amala-paul.html

No comments