Breaking News

‘సవ్యసాచి’లో మాధవన్ చేయడానికి కారణమిదే!!


తమిళంలో ‘సఖి’, ‘చెలి’, ‘యువ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాధవన్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి కాబట్టి. మాధవన్ ఇంతవరకు తెలుగులో ఒక్క స్ట్రెయిట్ మూవీ కూడా చేయలేదు. ఆమధ్య ‘ఓం శాంతి’లో నటించినా… అది అతిథి పాత్రే. ఇప్పుడు నాగ చైతన్య - చందూ మొండేటి కాంబినేషన్ వస్తున్న ‘సవ్యసాచి’లో విలన్‌గా నటించాడు. దీంతో ఈయన తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి.

మణిరత్నం డైరెక్షన్ లో మాధవన్ ‘యువ’ సినిమాలో పూర్తిస్థాయి విలన్‌ రోల్‌ చేశాడు. మళ్లీ ఇప్పుడు ‘సవ్యసాచి’లో పూర్తి స్థాయి విలన్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే మాధవన్ ఈ సినిమా చేసే ముందు టీంకు ఒక కండిషన్ పెట్టాడట. దానికి ఓకే అంటేనే సినిమా చేస్తా అని చెప్పాడట. అదేంటంటే... ‘సవ్యసాచిని తమిళంలో విడుదల చేయకూడదు’ అని.. ‘సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేస్తే, తను హీరోగా చేసే సినిమాలపై, కెరీర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందని మాధవన్‌ భావించడంతో మేకర్స్ ఓకే చెప్పారంట.

తమిళంలో రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే ఏరియాస్ లో ‘సవ్యసాచి’ తెలుగు వెర్షన్‌ విడుదల చేస్తున్నారు. సో మాధవన్ పెట్టిన కండిషన్స్ కి దర్శక నిర్మాతలు సరే అని చెప్పడంతో మాధవన్ ఇందులో విలన్ గా చేయడానికి ఓకే అన్నాడు. నవంబర్ 2న ఈసినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు హీరో అండ్ టీం.



By November 01, 2018 at 03:45PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43293/r-madhavan.html

No comments