Breaking News

వీరరాఘవుడిని దసరా నిలబెట్టేసింది


రెండేళ్లుగా ఎన్టీఆర్ దసరా బరిలో సినిమాలు విడుదల చేస్తూ... కలెక్షన్స్ కొల్లగొడుతున్నాడు. గత ఏడాది కళ్యాణ్ రామ్ నిర్మాతగా మంచి బడ్జెట్ తో బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాని గత ఏడాది మహేష్ స్పైడర్ మీద పోటీగా విడుదల చేశాడు. అయితే జై లవ కుశ సినిమాకి హిట్ టాక్ వచ్చింది కానీ... సూపర్ హిట్ టాక్ రాలేదు. అయినా దసరా బరిలో సినిమా విడుదల చెయ్యడం వలన హిట్ సినిమా అలా... సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. నిర్మాత కళ్యాణ్ రామ్ లాభాలు ఆర్జించాడు. కారణం కేవలం దసరా సెలవుల్లో సినిమా విడుదల చెయ్యడమే.

ఇక తాజాగా ఈ ఏడాది దసరా సెలవలకి త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని బ్యానర్ లో అరవింద సమేత - వీర రాఘవ ని కూడా ఆఘమేఘాల మీద చిత్రీకరించి దసరా సెలవులకి విడుదల చేసేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. అయితే అరవింద సమేత ఫస్ట్ హాఫ్ అంతగా లేదు.. సెకండ్ హాఫ్ సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. అయినా సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది. అరవింద సమేత గత గురువారం విడుదలై వీక్ డేస్ కూడా అరవింద కలెక్షన్స్ అద్భుతంగా వున్నాయి.

మరి హిట్ టాక్ తో అరవింద సమేత సూపర్ హిట్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది అంటే... కేవలం దసరా సెలవులే కారణం. పిల్లలకి దసరా సెలవులు ఇవ్వడం పాపం సినిమాని విడుదల చేసి ఫుల్ క్యాష్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. కేవలం దసరా సెలవులకు అరవింద సమేతని విడుదల చెయ్యాలని కంకణం కట్టుకుని మరీ సినిమా షూటింగ్ ని ఎన్టీఆర్ తండ్రి మరణించినా పళ్ళ బిగువన పూర్తి చేసి మరీ సాధించాడు.



By October 16, 2018 at 03:02PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43040/ntr.html

No comments