Breaking News

అల్లు అర్జున్ కూడా రాంచరణ్ రూటులోనే..!


పెద్ద నిర్మాతలు అయిన డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, దగ్గుబాటి రానా, నాని, అల్లుఅరవింద్‌ వంటి వారందరు ప్రస్తుతం కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాల వైపు, లోబడ్జెట్‌ చిత్రాలు, మంచి టాలెంట్‌ ఉన్న యువదర్శకులతో సినిమాలు చేస్తున్నారు. డి.సురేష్‌బాబు ఇప్పటికే ‘పెళ్లిచూపులు’తో పాటు పలు చిత్రాలను విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడు హీరో దగ్గుబాటి రానా కూడా ఇటీవల ‘కేరాఫ్‌ కంచరపాళెం’ వంటి విభిన్న చిత్రంతో ముందుకు వచ్చాడు. నాని ‘అ!’, దిల్‌రాజు కూడా బయటి చిన్న చిత్రాలను కొనుగోలు చేసి విడుదల చేస్తూ, మరోవైపు తన సొంత బేనర్‌లోనే యంగ్‌హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నాడు. అల్లుఅరవింద్‌ ‘గీతాఆర్ట్స్‌’ పై భారీ చిత్రాలు తీస్తున్నా కూడా ‘గీతాఆర్ట్స్‌2’ బాధ్యతలను బన్నీవాసుకి ఇచ్చి ఇటీవలే ‘గీతగోవిందం’ వంటి కనకవర్షం కురిపించిన చిత్రం నిర్మించాడు. ఇక ఈయన వి4 బేనర్‌లో జ్ఞానవేల్‌రాజా,యువిక్రియేషన్స్‌ వంటి వారితో కలసి మంచి చిత్రాలను, బయట హీరోల చిత్రాలను ప్రొడ్యూస్‌ చేస్తున్నాడు. 

పవన్‌కళ్యాణ్‌కి ఆల్‌రెడీ ‘పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌’ బేనర్‌ ఉంది. అందులో తానే హీరోగా ‘జానీ, సర్దార్‌గబ్బర్‌సింగ్‌’లు చేశాడు. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డిలతో ‘చల్‌ మోహనరంగ’ చిత్రం నిర్మించాడు. భవిష్యత్తులో యంగ్‌ హీరోలు, న్యూడైరెక్టర్స్‌తో సినిమాలు తీస్తానని, రామ్‌చరణ్‌తో కూడా ఒక చిత్రం ఉంటుందని చెప్పాడు. ఇక సుకుమార్‌, సంపత్‌నంది నుంచి పలువురు దర్శకులు కూడా చిన్న సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారి పేరుతో చిన్నసినిమాలు రూపొందితే మంచి ఓపెనింగ్స్‌, సినిమాకి మంచి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. ఇక విషయానికి వస్తే నిన్నమొన్నటి వరకు మెగాహీరోలందరికీ గీతాఆర్ట్స్‌ హోం బేనర్‌గా ఉందేది. వారి చేతిలోనే గీతాఆర్ట్స్‌, గీతాఆర్ట్స్‌2, వి4 సంస్థలు ఉన్నాయి. 

ఇక నాగబాబు స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ ఉన్నా.. మెగాస్టార్‌ చిరంజీవి హోమ్‌ బేనర్‌గా రామ్‌చరణ్‌ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ను స్థాపించి, ఇప్పటికే తన తండ్రి చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీనెంబర్‌ 150’ నిర్మించి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ని ‘సై..రా..నరసింహారెడ్డి’తో ‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇక త్వరలో అల్లుఅర్జున్‌ కూడా సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పనున్నాడట. ఆల్‌రెడీ తమ ఫ్యామిలీలో ‘గీతాఆర్ట్స్‌’ వంటివి ఉన్నా అవి అల్లు వారి ముగ్గురు కుమారులకు చెందుతాయి. దాంతో బన్నీ తనకంటూ ఓ సొంత బేనర్‌ ఏర్పాటు చేయనున్నాడని సమాచారం. ఇందులో తాను హీరోగా నటించే చిత్రాలే కాదు. యంగ్‌ హీరోలు, డైరెక్టర్స్‌తో కూడా లో బడ్జెట్‌ చిత్రాలను తీయనున్నాడని తెలుస్తోంది. 



By October 23, 2018 at 06:58AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43142/allu-arjun.html

No comments