Breaking News

పూజా.. ‘అరవింద..’ ఫంక్షన్‌కి ఎందుకు రాలేదంటే?


ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ చైర్ కి చేరువలో ఉన్న పూజ హెగ్డే మహేష్ మహర్షి షూటింగ్ లోను, బాలీవుడ్ లో మరో సినిమా షూటింగ్స్ తోనూ పిచ్చ బిజీగా వుంది. అందుకే పూజ హెగ్డే గత రాత్రి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత - వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయింది. ఎన్టీఆర్ మాస్ క్లాస్ హీరోగా నటిస్తున్న అరవింద సమేతలో అరవింద టైటిల్ రోల్ పోషిస్తుంది పూజ హెగ్డే. అంటే సినిమాకి ముఖ్యమైన కీ రోల్ అన్నమాట, అందుకే టైటిల్ కూడా అరవింద సమేత అని పెట్టారు. ఇక సినిమాలోనూ పూజ హెగ్డే క్యూట్ లుక్స్ తో ఎన్టీఆర్ ని తన చుట్టూ తిప్పుకునే పాత్ర. ఎన్టీఆర్ ని ప్రేమిస్తూనే అతనితో ఆడుకుంటుంది. మరి అరవింద ట్రైలర్ లో పూజ హెగ్డే ని చూసిన దానిని బట్టి.... పూజ కి కక్షలన్నా.. పగలన్నా, రక్తపాతమన్నా అస్సలు నచ్చదు. ఏదైనా తెలివితో ప్రేమతో మనుషులను మార్చాలని ఎన్టీఆర్ కి చెబుతుంటుంది.

ఇక ఎన్టీఆర్ తో డ్యూయెట్ లాంటివి ఏవి ట్రయిలర్ లో కనిపించకపోయినా... ఎన్టీఆర్ తో మాత్రం పూజ రొమాంటిక్ యాంగిల్ బావుంది. ఇక అరవింద షూటింగ్ కంప్లీట్ కావడంతో.. పూజ తన షెడ్యూల్ ని మహర్షి తదుపరి ఇటలీ షెడ్యూల్ కోసం, బాలీవుడ్ లో నటిస్తున్న మరో సినిమా కోసం కేటాయించింది. మరి ఒకే ఒక్క సినిమాతో ఒక్కసారిగా బిజీ అయిన పూజ ఇప్పుడు అరవింద సమేత ప్రమోషన్స్  లో పాల్గొనాలన్నా.. బిజీ షెడ్యూల్ అడ్డురావడంతోనే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవలేకపోయింది. ఇక మహేష్ తో నటిస్తున్న సినిమాతో పాటుగా.. ప్రభాస్ తో జిల్ రాధాకృష్ణ సినిమాలోనూ నటించాల్సి ఉంది. ఆ సినిమా కూడా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ తో పట్టాలెక్కేందుకు సిద్ధంగా వుంది.

ఇక అరవింద సమేత హిట్ అయ్యిందా.. పూజకి తిరుగుండదు. ఎందుకంటే ఇప్పటి వరకు పూజ చేతిలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ యావరేజ్ సినిమాలే. ఇకపోతే అరవింద సమేత కోసం పూజ హెగ్డే తన గొంతు కూడా సవరించింది. అరవింద పాత్రకు పూజ హెగ్డేనే డబ్బింగ్ చెప్పుకుంది. మరి అరవింద ట్రైలర్ లో కాస్త మైనస్ ఏదైనా ఉంది అంటే.. పూజ హెగ్డే వాయిస్ అంటున్నారు. మరి త్రివిక్రమ్ తన హీరోయిన్స్ తో ఓన్ గా డబ్బింగ్ చెప్పించినట్టుగానే.. దీనిలోనూ పూజ తో డబ్బింగ్ చెప్పించాడు. మరి ట్రైలర్ లో పూజ వాయిస్ అంతగా మ్యాచ్ కాలేదు. చూద్దాం రేపు 11 న థియేటర్స్ లో పూజ నటనతో పాటుగా వాయిస్ ఎలా వుండబోతుందో అనేది.



By October 05, 2018 at 02:29AM

Read More

No comments