ఈ ‘నవాబ్’పై కేసీఆర్, కేటీఆర్ ప్రశంసలు
నవాబ్ సినిమా వీక్షించిన కేసీఆర్ మరియు కేటీఆర్ కుటుంబం
మన భారతదేశ చలనచిత్ర చరిత్రలో దర్శకుడు మణిరత్నంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో ఆణిముత్యాలు భారత దేశ ప్రజలని ప్రత్యేకంగా తెలుగు తమిళ ప్రేక్షకులని మంత్ర ముగ్ధులని చేశాయి. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో మరో ఆణిముత్యం విడుదలయింది అదే ‘నవాబ్’. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. సామాన్య ప్రేక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా సినిమా మహా అద్భుతం అంటూ ట్వీట్ చేస్తున్నారు. అగ్ర హీరోలు మహేష్ బాబు, శ్రీకాంత్, రాజశేఖర్, వి వి వినాయక్ తదితరులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు కేసీఆర్ మరియు కేటీఆర్ ఫ్యామిలీ ఇంకా మంత్రి వివేక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమాను వీక్షించి సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్క కుటుంబం చూడాలి అని తెలిపారు.
శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితి రావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. అశోక్ వల్లభనేని నిర్మాత. మణిరత్నం దర్శకుడు.
By October 05, 2018 at 03:46AM
Read More
No comments