Breaking News

మంచు విష్ణుకి క్షమాపణలు చెప్పేశారు..!


అందరూ విదేశాల గురించి ఎక్కువగా చెబుతూ ఉంటారు. మన దేశంలోనే కుల, మత బేధాలు ఉన్నాయని సింపుల్‌గా తప్పుపడుతూ ఉంటారు. కానీ వివక్ష అనేది ఎంతో అభివృద్ది చెందిన దేశాలలో కూడా ఉంది. అయితే అక్కడ వాటి రూపాలు వేరు. విదేశస్థులు, నల్లజాతి ప్రజలు, ముఖ్యంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం పెరిగిన తర్వాత మన ఉపఖండంలోని ప్రతి ఒక్కరనీ విదేశాలలో అనుమానిస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల సిక్కుల తలపాగా, గడ్డం చూసి ముస్లింలుగా భావించి వారిపై దాడులు జరుగుతున్నాయి. 

ఇక ఇటీవల మన భారతీయులపై విదేశాలలో దాడులు పెరిగిపోతున్నాయి. స్వయాన షారుఖ్‌ఖాన్‌ నుంచి ఎందరికో గతంలో విదేశాలలోని ఎయిర్‌పోర్ట్‌లలో ఘోర అవమానాలు జరిగాయి. జాతి వివక్ష, వర్ణవివక్ష ఎక్కువయ్యాయి. నాడు మహాత్మాగాంధీని దక్షిణాఫ్రికాలో రైలు నుంచి తోసివేశారు. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. విషయానికి వస్తే తాజాగా మంచు విష్ణుకి కూడా అలాంటి అవమానమే జరిగిందట. 

ఆయన ఇటీవల లండన్‌ వెళ్లారు. అక్కడి నుంచి వెనిస్‌కి పయనమయ్యాడు. కానీ ఆయన లగేజీ మాత్రం లండన్‌లోనే ఉండిపోయింది. ఆయన బ్రిటన్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో లండన్‌ నుంచి వెనిస్‌కి వెళ్లాడు. కానీ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఆయన లగేజీని మాత్రం లండన్‌లోనే వదిలేసింది. దీంతో ఆగ్రహించిన విష్ణు వ్యంగ్యంగా ఓ ట్వీట్‌ చేశాడు. వెనిస్‌లో దిగాను. లండన్‌ నుంచి ఇక్కడికి వచ్చాను. నా లగేజీని లండన్‌లో వదిలేసినందుకు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కి ధన్యవాదాలు. లవ్‌ యూ టూ.. అని అన్నాడు. దీనికి స్పందించిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తమైందని, అసౌకర్యానికి క్షమించాలని కోరింది. 

ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని, వీలైనంత తొందరగా తమ సిబ్బంది మీ అడ్రస్‌కే లగేజీని చేరుస్తామని తెలిపింది. అక్టోబర్‌5వ తేదీన హైదరాబాద్‌ నుంచి లండన్‌కి బయలుదేరానని, ఆ రోజు కూడా అసౌకర్యానికి గురయ్యానని, విమానం 5గంటలు ఆలస్యంగా బయలుదేరిందని కూడా విష్ణు ట్వీట్‌ చేశాడు. ఈ మధ్య ఆయన సోదరి మంచు లక్ష్మి కూడా హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో సమయం వృధా అవుతోందని పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 



By October 11, 2018 at 05:46AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/42958/british-airways.html

No comments