Breaking News

మహేష్-సుక్కు.. ఈ వార్తలపై స్పందించరే..?


చరణ్‌తో నాన్ ‘బాహుబలి’ రికార్డులు కొట్టించిన సుకుమార్ ప్రస్తుతం మహేష్‌తో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈసినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘1 నేనొక్కడినే’ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి అటువంటి సినిమా తీయను..స్ట్రెయిట్ నెరేషన్ తో మహేష్ ని పెట్టి సినిమా తీస్తా అని సుకుమార్ చాలా సందర్భాల్లో అన్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కంప్లీట్ అయినా వెంటనే సుకుమార్‌తో మహేష్ సినిమా చేయనున్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సుకుమార్ ఇప్పటి వరకు మహేష్‌కు మూడు లైన్లు వినిపిస్తే మహేష్ దేనికీ కన్విన్స్ కాలేదట. దాంతో మహేష్ 26వ చిత్రం సుకుమార్ తోనే ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు సుకుమార్‌కు బలంగా నిలిచిన అతని టీమ్‌లోని ముగ్గురు రైటర్లు దర్శకులుగా మారి సొంత ప్రాజెక్ట్స్ దక్కించుకోవడంతో వాళ్ళ అండ సుక్కుకు లేకుండా పోయింది.

సుకుమార్ నిజామ్ పాలన నాటి రజాకార్ల బ్యాక్‌డ్రాప్‌లో ఓ లైన్ వినిపిస్తే పీరియాడిక్ కథలతో రిస్క్ వద్దని క్యాన్సిల్ చేశాడట మహేష్. ఆల్రెడీ మహేష్.. సుకుమార్‌కు ఫిబ్రవరి లోపు స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉండేలా ప్లాన్ చేయమని చెప్పాడని అంటున్నారు. అది కూడా కథ నచ్చితేనే అనే కండీషన్ మీద. మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి. అసలు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ అప్పుడే మొదలెట్టేశారు. అయితే మహేష్‌, సుక్కు మాత్రం ఈ సినిమా గురించి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం విశేషం.



By October 29, 2018 at 12:56PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43246/mahesh-babu.html

No comments