Breaking News

అర్జున్‌కి నాటి తరం హీరోయిన్ల మద్దతు


ప్రస్తుతం చాలా మంది సినీ ప్రముఖులపై నటీమణులు, గాయనీమణులు, సాంకేతిక వర్గంలో పనిచేసిన వారు కూడా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏదో వైరముత్తు, ధనుష్‌, శింబు వంటి వారిపై ఆరోపణలు వస్తే వాటిని నమ్మేందుకు చాలా మంది అనుకూలంగానే ఉన్నారు. కానీ నానాపాటేకర్‌ వంటి వ్యక్తిపై తనుశ్రీదత్తా, అమితాబ్‌ని బెదిరిస్తూ హెయిర్‌స్టైలిస్ట్‌, ఇక యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ మీద ఆరోపణలు చేసిన శృతిహరిహరన్‌ వంటి వారు చేస్తున్న ఆరోపణలను మాత్రం ఎవరూ నమ్మడం లేదు. వారిపై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం నిజం అయి ఉండకపోవచ్చు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. 

ఇక అర్జున్‌ విషయానికి వస్తే ఆయనకుటుంబం ఇప్పటికే ఆయనకు మద్దతుగా నిలిచింది. ఆయన కూతురు, నటి ఐశ్వర్య తన తండ్రి పబ్‌కి వెళ్లడం కూడా చూడలేదని చెప్పింది. ఇక విషయానికి వస్తే మేఘనా గవాంకర్‌, అవంతిక శెట్టిలు శృతిహరిహరన్‌కి మద్దతు తెలపగా అర్జున్‌ సజ్జాకి కూడా చాలామంది నిన్నటితరం టాప్‌ హీరోయిన్లు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విషయంపై నిన్నటితరం స్టార్‌ హీరోయిన్‌ ఖుష్బూ స్పందిస్తూ.. శృతి ఆరోపించిన టైప్‌ వ్యక్తి అర్జున్‌ కాదు. ప్రతి ఒక్కరికి ఆయన ఎంతో గౌరవమర్యాదలు ఇస్తారు. ఆయన అలా చేయలేదని, ఆయన అలాంటి వ్యక్తి కాదని నేను గ్యారంటీ ఇస్తాను. 34ఏళ్ల నుంచి సినీ రంగంలో ఆయన నాకు పరిచయం. నేను నటించిన మొదటి చిత్రానికి ఆయనే హీరో. ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించలేదు. శృతిహరిహరన్‌ ఆరోపణలు విని ఆశ్చర్యానికి, షాక్‌కి గురయ్యాను. ఒక కుటుంబానికి తండ్రి అయిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే విషయం ఆయనపై ఆరోపణలు చేసేముందు మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను అర్జున్‌కి మద్దతు ఇవ్వకుండా ఉంటే 34 ఏళ్ల మా స్నేహానికి అవమానం కలుగుతుంది.. అని చెప్పుకొచ్చింది. 

ఇక అర్జున్‌కి అందాల నటి హర్షిక పూణచ్చా కూడా మద్దతు ఇచ్చింది. శృతిహరిహరన్‌పై ఆమె పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేడు ఆరోపణలు చేస్తున్న వారే గతంలో ప్రముఖుల ముందు మెప్పుపొందడం కోసం అర్ధనగ్నప్రదర్శనలు చేశారు. మీటూ ఆరోపణలు గమనిస్తున్నాను. అయితే ఓ మహిళగా నేను చిత్ర పరిశ్రమను చాలా దగ్గరగా చూస్తున్నాను. ఒక మహిళను గౌరవించడం మన ధర్మం. అయితే పబ్లిసిటీకోసం ఓ మంచి వ్యక్తిపై ఆరోపణలు చేసి వారి భార్య, పిల్లలను ఇబ్బంది పెట్టడం సరికాదు. దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ప్రముఖులపై ఒక్క ఆరోపణ చేసి వారిని ఓ అసత్యం ద్వారా చెడ్డవారిగా చూపించవద్దు. అర్జున్‌ ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడో ఆలోచించాలి? పేరు రావడానికి ఏమి చేసినా సరిపోతుంది. పేరు వచ్చిన తర్వాత నేను ఏం మాట్లాడినా సరిపోతుందని భావించడం సరికాదు. పేరున్న నిర్మాత నాకు ఓ వీడియో చూపించాడు. మీటూ అంటున్న నటి ఆ వ్యక్తి భుజం మీద నిద్రిస్తున్న వీడియోను స్వయంగా చూశాను. అలాంటి వారు మీటు అంటే సిగ్గేస్తోంది..అని చెప్పుకొచ్చింది. 

ఇక అర్జున్‌కి మద్దతుగా నటి, బిజెపి నాయకురాలు తారా అనురాధ నిలిచారు. ఈ వ్యవహారంలో నేను అర్జున్‌సర్జాకే మద్దతు ప్రకటిస్తున్నాను. ఆయనతో గతంలో నేను ఎన్నో చిత్రాలలో కలసి నటించాను. ఆయన ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు. శృతి మాటలన్నీ తప్పు అని చెప్పడం నా ఉద్దేశ్యంకాదు. కానీ ఆమె అర్జున్‌ని ఎందుకు టార్గెట్‌ చేస్తోందో అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చింది. 



By October 27, 2018 at 05:35AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43205/kushboo.html

No comments