Breaking News

తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధమట!!


జనసేన గెలుస్తుందా? లేదా? అధికారం కైవసం చేసుకుంటుందా? లేక ఫలితాలను మార్చే కీలక శక్తిగా జనసేన ఉంటుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పవన్‌కే సరైన నిర్ణయం లేదనే విషయం ఆయన మాటలను చూస్తే అర్ధం అవుతుంది. మొదట్లో అధికారం నాకు ముఖ్యం కాదు.. కేవలం ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్పాడు. ఇక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు బిజెపి-టిడిపి కూటమికి మద్దతు ఇచ్చానని తెలిపాడు. జగన్‌ని ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా నాయకుడు దోచుకునే వాడైతే అది సమాజానికే చేటని వ్యాఖ్యానించాడు. కానీ కొన్ని రోజులలోనే ఆయన వైఖరి మారింది. మరి జగన్‌ నిజాయితీపరుడని తేలిందా? లేదా జగన్‌ కంటే చంద్రబాబు, లోకేష్‌ , తెలుగుదేశం నాయకులు పెద్ద అవినీతిపరులని తెలిసిందా? అనేది సస్పెన్స్‌. దాంతో జగన్‌ని, మోదీని మాత్రం విమర్శించడం మానేశాడు. చంద్రబాబు, లోకేష్‌, టిడిపి నాయకులనే టార్గెట్‌ చేస్తున్నాడు. ఏపీకి తీరని ద్రోహం చేసిన మోదీని, అమిత్‌షాలను పల్లెత్తు మాట అనడం లేదు. ఇటీవల మాత్రం మోదీ, అమిత్‌షాలు తనకేమీ బందువులు కాదని చెప్పాడు. 

మరోవైపు ఐటీ దాడులు తప్పేమి కాదన్నాడు. రాఫెల్‌పై మాత్రం మౌనం వహించాడు. ఇక జగన్‌, మోదీల మధ్య రహస్య అవగాహన ఉందని పలువురు నమ్ముతున్నారు. ఇందులో పవన్‌ కూడా పావే అనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా టిడిపిని అధికారంలోకి రానివ్వనని శపథం చేశాడు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తమ మద్దతు అవసరం అవుతుందన్నాడు. దానిని బట్టి ఆయన ఎన్నికల తర్వాత వైసీపీకే మద్దతు ఇస్తాడని ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు. తన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అని తెలిపాడు. అయితే ఏపీలో అధికార పక్షమైన టిడిపిని దుయ్యబడుతున్న ఆయన తెలంగాణలో కూడా నిరంకుశంగా, కుటుంబపాలన, హామీలను నెరవేర్చని టిఆర్‌ఎస్‌ని పల్లెత్తు మాట అనడం లేదు. ఇక చంద్రబాబు అవినీతిపరుడా ? కాదా? అనే విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు నిరంకుశుడు, కక్ష్యసాధింపు చర్యల విషయంలో కేసీఆర్‌ అంతటి నియంత మాత్రం కాదు. ఆయన కూడా తప్పులు చేస్తాడు.. తన వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తాడే గానీ మాటల్లో, చేతల్లో కాస్త హుందాగానే ఉంటాడు. ఆ ధైర్యంతోనే పవన్‌, చంద్రబాబుని తీవ్రంగా విమర్శిస్తున్నా కూడా నియంతలైన మోదీ, కేసీఆర్‌, వచ్చే ఎన్నికలలో విజయావకాశాలు ఉన్న జగన్‌ విషయంలో మాత్రం మెతక వైఖరి చూపుతున్నాడు. 

ఇక కేసీఆర్‌, జగన్‌లు మోదీ కనుసన్నలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో పవన్‌కి వారితో లోపాయికారి ఒప్పందం ఉందంటున్నారు. ఇక తాజాగా ఈయన తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీపై కూడా ఓ అభిప్రాయానికి వచ్చాడని తెలుస్తోంది. టిడిపి మహాకూటమిలో చేరి తెలంగాణలో స్ధిరపడిన ఏపీ సెటిలర్స్‌ ఓట్లపై నమ్మకం పెట్టుకుంది. కానీ జనసేన కూడా ఏపీ సెటిలర్స్‌ ఎక్కువగా ఉన్న 24 శాసనసభా స్థానాలలో పోటీకి సిద్దం అవుతోంది. ఇది టిడిపికి, మహాకూటమికి ఎంత వరకు నష్టం కలిగిస్తుందో వేచిచూడాల్సివుంది.. ఇది కేసీఆర్‌కి అనుకూల నిర్ణయమే అని చెప్పాలి.



By October 16, 2018 at 04:02PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43042/pawan-kalyan.html

No comments