అక్టోబరు 24న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
అక్టోబరు 24న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
అక్టోబరు 22 , తిరుపతి 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 24వ తేదీ బుధవారం అన్నాభిషేకం ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం, అన్నలింగ అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నలింగ ఉధ్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 8 గంటలకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 22, 2018 at 05:23PM
No comments