Breaking News

సామాన్య భక్తుల సేవలో రాజీకి తావులేదు- తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు


సామాన్య భక్తుల సేవలో రాజీకి తావులేదు- తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 30 సెప్టెంబరు 2018: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాదిమంది సామాన్య భక్తజనులకు సేవలందించడంలో ఎటువంటి రాజీపడేదిలేదని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు.

తిరుమలలో ఆదివారం ఉదయం జెఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాద సౌకర్యాలను కల్పించడంలో రాజీకి తావులేకుండా సేవలందిస్తున్నామన్నారు. పెరటాశి నెల సందర్భంగా సాధారణ రోజులలో కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1 మరియు 2లు నిండి, బయట దాదాపు 2 కిలోమీటర్లు వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నట్లు తెలిపారు. అధిక రద్దీ కారణంగా అక్టోబరు 6, 7, 13, 14, 20, 21వ తేదీలలో వచ్చే శని, ఆదివారాలలో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశామని, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పరిమిత సంఖ్యలో కేటాయించామన్నారు. తద్వారా సామాన్య భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1 మరియు 2ల ద్వారా అధిక సంఖ్యలో సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా శని, ఆదివారాలలో వి.ఐ.పి.బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమలలో పెరటాశి నెల శని, ఆదివారాలలో క్యూలైన్ల నిర్వహణకు అదనంగా 120 మంది టిటిడి సిబ్బందిని డెప్యూటేషన్‌పై నియమించినట్లు తెలియజేశారు. వీరు తమకు కేటాయించిన ప్రాంతంలోని క్యూలైన్లలోని భక్తులకు అవసమైన తాగునీరు, అన్నప్రసాదాలు, మెడికల్‌, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను పర్యవేక్షిరని వివరించారు. అదేవిధంగా దసర సెలవులు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులకు టిటిడి అన్నప్రసాదం, విజిలెన్స్‌, ఆరోగ్య విభాగాలు విశేష సేవలందిస్తున్నాయన్నారు. కావున భక్తులు సంయమనంతో టిటిడికి సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని జెఈవో కోరారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.



By TTD News September 30, 2018 at 01:24PM

Read More

No comments