బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ అతనే..!
తెలుగులో 112 రోజులుగా రసవత్తరంగా నాని హోస్టింగ్ లో ఆడుతున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నేడు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్టార్ మా లో ప్రసారం అవుతుంది. అయితే బిగ్ బాస్ జూన్ 10 న మొదలైంది మొదలు బిగ్ బాస్ షో గురించిన లీకులు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ లో వారానికొకరు ఎలిమినేట్ అవడం... అది కూడా ఆదివారం రాత్రి నాని బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యే వారి పేరు చెప్పడం కన్నా ముందే అంటే ఆదివారం ఉదయానికల్లా బిగ్ బాస్ నుండి ఆ వారం ఎవరు బయటికొచ్చేసారో అనే విషయం ప్రేక్షకులకు తెలిసిపోతుంది. మొదటి వారం నుండి మొన్న ఆదివారం వరకు ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ ఎవరు అవుతున్నారో అనే విషయం లీకుల ద్వారా సోషల్ మీడియా కి పాకిపోతుంది.
ఇక ఆ ఎలిమినేషన్ ప్రక్రియ టివి లో ప్రసారం కాకమునుపే కొన్ని వెబ్ సైట్స్ బిగ్ బాస్ నుండి బయటికొచ్చిన వారి పేర్లను బయటికి చెప్పేస్తున్నాయి. మరి స్క్రిప్ట్ ప్రకారం నడిచే బిగ్ బాస్ స్టార్ మా లో రోజూ ప్రసారం చేసే ఎపిసోడ్ ని ఒకరోజు ముందే షూట్ చేయడం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ కి పనిచేసే టెక్నీషియన్స్ నుండే ఆ లీకులు బయటికొస్తున్నాయనే టాక్ ఉంది. కానీ స్టార్ మా యాజమాన్యం ఆ లీకులకు ఫుల్ స్టాప్ పెట్టే పనులేమీ చెయ్యకుండా మౌనం వహించింది. అందుకే తాజాగా ఈ షో లో అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పేరు కూడా బయటికి వచ్చేసింది. అందరూ అనుకున్నట్టుగానే కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నరంటూ సోషల్ మీడియాలో ప్రసారం హోరెత్తుతోంది. ఎప్పటినుండో కౌశల్ బిగ్ బాస్ హౌస్ ఒంటరి శక్తిలా ఎదిగాడు. కొంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ.. కౌశల్ ఆర్మీ అంటూ బిగ్ బాస్ బయట కొంతమంది హల్చల్ చేయడం.. ఇక వారానికొకరు చొప్పున ఎలిమినేట్ అయినవారు బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ తో గొడవపడి.. బయటికొచ్చి కౌషల్ ఆర్మీకి బుక్ అయ్యామని పలు ఇంటర్వూస్ లో చెప్పడం, హౌస్ లో ఫైనల్ కి చేరిన తనీష్, దీప్తి, గీత మాధురి, సామ్రాట్ లను దాటుకుని కౌశల్ బిగ్ బాస్ సీజన్ టు టైటిల్ విన్నర్ గా నిలిచాడంటున్నారు.
అయితే ఎప్పుడూ బయటికొచ్చే ఎలీకులగే ఇదికూడా బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఇది నిజమా కాదా అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం నాని ఆధ్వర్యంలో జరగబోయే బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో బయటికొస్తుంది. ఇకపోతే తాజాగా కౌశల్ ఒక కప్ చేతిలో పట్టుకుని విజయ గర్వంతో ఉన్న ఫోటో ఒకటి నెట్ లో హల్చల్ చేస్తుంది. అయితే అది బిగ్ బాస్ సీజన్ టు విన్నర్ కప్ అవునా... కదా.. లేదా కౌశల్ మరో పోటీలో నెగ్గిన కప్పా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కానీ కౌశల్ చేతిలో ఉన్న కప్పుతో ఉన్న ఫోటో మాత్రం సోషల్లో మీడియాలో ఇంటర్నెట్ లో కౌశల్ ఆర్మీ తెగ షేర్ చేసి పడేస్తుంది.
By October 01, 2018 at 07:59AM
Read More
No comments